Begin typing your search above and press return to search.

#సర్కార్ వారు.. బ్యాంకు కుంభ‌కోణం నేప‌థ్యంలో కామెడీనా?

By:  Tupaki Desk   |   26 Dec 2020 10:05 AM IST
#సర్కార్ వారు.. బ్యాంకు కుంభ‌కోణం నేప‌థ్యంలో కామెడీనా?
X
సూపర్ స్టార్ మహేష్ ఏడాది గ్యాప్ త‌ర్వాత `సర్కారు వారి పాట` సెట్స్ లో జాయిన్ కానున్నారు. రెగ్యుల‌ర్ చిత్రీకరణ జనవరిలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ నిర్మాణం సాగుతోంది. నిజానికి ఈ మూవీ మెజారిటీ షూటింగ్ అమెరికాలో చేయాల్సి ఉండ‌గా.. తాజా మ‌హ‌మ్మారీ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అమెరికా షెడ్యూల్ ని వాయిదా వేశారు.

ఈలోగానే హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో నిర్మిస్తున్న భారీ సెట్లో చిత్రీక‌ర‌ణ‌కు చిత్ర‌బృందం సిద్ధ‌మ‌వుతోంది. ఇంత‌కీ ఈ షూట్ లో ప్రాధాన్య‌త ఏమిటి? అంటే.. ఈ మూవీ బ్యాంక్ కుంభకోణం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రం కొంత భాగాన్ని బ్యాంకులో చిత్రీకరించాలి. బ్యాంక్ ఇన్ సైడ్ అవ‌స‌ర‌మైన ఎపిసోడ్స్ ని ఫిల్మ్ సిటీలో ప్రత్యేక బ్యాంక్ సెట్ లోనే పూర్తి చేస్తారు.

అటుపై అమెరికా వెళ్లి అక్క‌డ బ్యాంక్ వెలుప‌లి స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ రెండూ మూవీలో చాలా కీల‌కం. మెజారిటీ షూట్ బ్యాంకులోనే ఉంటుంది. ఒక ర‌కంగా బ్యాంక్ కుంభ‌కోణం నేప‌థ్యంలో ప‌ర‌శురామ్ చ‌క్క‌ని ప్ర‌యోగాన్ని ఎంచుకున్నార‌నే అర్థ‌మ‌వుతోంది. అయితే ఇందులోనే కామెడీ సెంటిమెంట్ ఎంట‌ర్ టైన్ మెంట్ ని ఎలా చూపిస్తారు? అన్న‌ది వేచి చూడాలి. కీర్తి సురేష్ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్స్ ఇందులో న‌టించ‌నున్నారు. మైత్రి మూవీ మేకర్స్- 14 రీల్స్ ప్లస్- జీఎంబి ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.