Begin typing your search above and press return to search.

'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకునేందుకు రెడీ

By:  Tupaki Desk   |   5 Aug 2019 11:53 AM GMT
సరిలేరు నీకెవ్వరు అనిపించుకునేందుకు రెడీ
X
మహేష్‌ బాబు సమ్మర్‌ లో 'మహర్షి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి చిత్రం సక్సెస్‌ జోష్‌ లో ఉన్న మహేష్‌ బాబు ప్రస్తుతం తన 26వ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'తో రెడీ అవుతన్నాడు. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను అనీల్‌ సుంకర మరియు దిల్‌ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎఫ్‌ 2 వంటి ఫుల్‌ లెంగ్త్‌ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ ను తెరకెక్కించిన అనీల్‌ రావిపూడి అదే తరహా ఎంటర్‌ టైనర్‌ గా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంను తెరకెక్కిస్తున్నాడు.

సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా విడుదలకు చాలా సమయం ఉండగానే మహేష్‌ బాబు ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 9వ తారీకున మహేష్‌ బాబు పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. మహేష్‌ పుట్టిన రోజు సందర్బంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌ తోనే అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులతో కూడా సరిలేరు నీకెవ్వరు మహేష్‌ అనేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌ పై చాలా శ్రద్ద పెడుతున్నట్లుగా తెలుస్తోంది.

మేజర్‌ అజయ్‌ పాత్రలో నటిస్తున్న మహేష్‌ బాబు ఫస్ట్‌ లుక్‌ ను మేజర్‌ కాస్ట్యూమ్స్‌ లోనే ప్లాన్‌ చేస్తున్నారు. మేజర్‌ పాత్రలో అయినా మహేష్‌ బాబు పాత్ర చాలా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ గా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఫస్ట్‌ లుక్‌ తప్పకుండా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఉంటుందనే నమ్మకంతో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ లో చిత్రీకరణ జరుపుకుంటున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం షూట్‌ లో మహేష్‌ బాబు, రష్మికతో పాటు బండ్ల గణేష్‌ ఇతర ముఖ్య నటీనటులు పాల్గొంటున్నారు.