Begin typing your search above and press return to search.

స‌రిలేరు నీకెవ్వ‌రు 3రోజుల షేర్

By:  Tupaki Desk   |   14 Jan 2020 2:20 PM GMT
స‌రిలేరు నీకెవ్వ‌రు 3రోజుల షేర్
X
సంక్రాంతి పందెంలో మూడు సినిమ‌లు రిలీజయ్యాయి. ఇందులో మ‌హేష్ -స‌రిలేరు నీకెవ్వ‌రు.. బ‌న్ని - అల వైకుంఠ‌పుర‌ములో బాక్సాఫీస్ వ‌ద్ద ఠ‌ఫ్ కాంపిటీట‌ర్స్ గా ఉన్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. స‌రిలేరు చిత్రం తొలి వీకెండ్ ఏపీ - తెలంగాణ‌లో సుమారు 50 కోట్ల షేర్.. వ‌ర‌ల్డ్ వైడ్ 63కోట్ల మేర షేర్ వ‌సూలు చేసింద‌ని తెలుస్తోంది.

వ‌సూళ్ల వివ‌రాలు చూస్తే.. నైజాం-3.28 కోట్లు.. సీడెడ్- 1.04కోట్లు.. ఉత్త‌రాంధ్ర -1.12కోట్లు.. కృష్ణ‌-47ల‌క్ష‌లు.. గుంటూరు 46ల‌క్ష‌లు.. ఈస్ట్ 49ల‌క్ష‌లు.. వెస్ట్ 37ల‌క్ష‌లు.. నెల్లూరు 23 ల‌క్ష‌లు వ‌సూలైంది. ఏపీ తెలంగాణ క‌లుపుకుని 49.56 కోట్ల షేర్ వ‌సూలైంది. రెస్టాఫ్ ఇండియా 6.15 కోట్లు..ఓవ‌ర్సీస్ 8.60కోట్లు.. వ‌సూలైంది. ఓవ‌రాల్ గా వ‌ర‌ల్డ్ వైడ్ 63 కోట్ల మేర షేర్ వ‌సూలైంది.

దాదాపు 99కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఆ మేర‌కు షేర్ వ‌సూలు చేయాల్సి ఉంటుంది. తొలి మూడు రోజుల‌కు స‌గం వ‌సూలైంది. మిగ‌తా స‌గం ఇదే దూకుడుతో వ‌సూలు చేయాల్సి ఉంటుంది. అయితే భోగి-సంక్రాంతి-క‌నుమ వ‌సూళ్లకు డోఖా ఉండ‌ద‌న్న అంచనాలున్నాయి. సెల‌వులు క‌లిసొస్తాయి. పండ‌గ హుషారు సినిమాకి ప్ల‌స్ కానుంది. కాంపిటీష‌న్ లో రెండు మూడు సినిమాలు ఉన్నా.. స‌రిలేరు ఓపెనింగులు సంతృప్తి క‌ర‌మేన‌న్న టాక్ వినిపిస్తోంది.