Begin typing your search above and press return to search.

చివ‌రికి శ్రుతి ఇలా కనిపించింది

By:  Tupaki Desk   |   5 May 2018 3:30 PM GMT
చివ‌రికి శ్రుతి ఇలా కనిపించింది
X
శ్రుతి హాస‌న్ కొన్ని నెల‌ల పాటూ సినిమా ప్ర‌పంచానికి దూరమైపోయింది. క‌నీసం మీడియా ముందుకు రావ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. ఏ సినిమా ఒప్పుకోలేదు. ఇండియాకు లండ‌న్‌కు మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. ఆమె పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డిందేమో అందుకే సినిమాలు ఒప్పుకోవ‌డం లేద‌ని అనుకున్నారంతా. కానీ శ్రుతి మ‌ళ్లీ సినిమాలు మొద‌లెట్టింది. అమ్మ‌తో క‌లిసి త‌న కొత్త సినిమా షూటింగ్ సెట్‌కు వ‌చ్చింది.

2017లో తెలుగులో కాట‌మ‌రాయుడులో క‌నిపించింది శ్రుతి హాస‌న్‌. ఆ త‌రువాత తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. అలాగే హిందీలో కూడా 2017లోనే చివ‌రి సినిమా విడుద‌లైంది. మ‌రి ఏ సినిమా ఒప్పుకోలేదు శ్రుతి. త‌న బాయ్ ఫ్రెండ్ లండ‌న్‌కు చెందిన మైకెల్ కోర్సెల్‌తో క‌లిసి షికార్లు కొట్ట‌డం మాత్రం మీడియాకు చిక్కింది. ఎయిర్ పోర్టుల్లోనే ఎక్కువ‌గా ఈ జంట అంద‌రి కంటా ప‌డింది. అలాగే ప్రియుడిని త‌ల్లి సారిక‌కు ప‌రిచ‌యం చేయ‌డం వారు ముగ్గురు రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డం లాంటి వ‌న్నీ కూడా మ‌ధ్య‌లో జ‌రిగాయి. అలాగే తండ్రికి కూడా మైకెల్‌ను ప‌రిచ‌యం చేసింది శ్రుతి. ఇదంతా చూశాక ఆమె పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డిందేమో అనుకున్నారంతా. అన్న‌ట్టు ఈ ఏడాది డిశెంబ‌రులోనే పెళ్ల‌ని కూడా రూమ‌ర్లు వ‌చ్చాయి. ఇలాంటి స‌మ‌యంలో శ్రుతి త‌ల్లితో స‌హా షూటింగ్ స్పాట్‌లో క‌నిపించి అంద‌రికీ షాక్ ఇచ్చింది. త‌న త‌ల్లి సారికతో ద‌ర్శ‌కుడు మ‌నీష్ మంజ్రెక‌ర్‌ తో క‌లిసి ఫోటోకు ఫోజిచ్చింది.

బాలీవుడ్‌లో మ‌నీష్ మంజ్రెక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంది శ్రుతి. ఇందులోవిద్యుత్ జ‌మ్వాల్ హీరోగా చేస్తున్నాడు. గ‌తంలోనే ఈ జంట యారా అనే సినిమాలో క‌లిసి న‌టించింది. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా విడుద‌ల కాలేదు. ఇప్పుడు మ‌రో సినిమాలో జంట‌గా క‌నిపించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రి అమ్మ‌డు తెలుగులో ఎప్పుడు క‌నిపించ‌నుందో.