Begin typing your search above and press return to search.
సర్దార్ మళ్లీ షురూ అవుతోందోచ్
By: Tupaki Desk | 28 Sept 2015 11:27 AM ISTకొన్నాళ్లుగా పవన్ సినిమా గురించి రకరకాలుగా ప్రచారం సాగుతోంది. కెమెరామెన్ జయనన్ విన్సెంట్ సెట్ నుంచి వాకౌట్ చేయడంతో ఆ సినిమా ఆగిపోయిందని వార్తలొచ్చాయి. జయనన్ కీ - పవన్ కళ్యాణ్ కీ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని కొందరు... కాదు కాదు జయనన్ కీ - దర్శకుడు బాబీకి మధ్య పొసగడడం లేదని మరికొందరు మాట్లాడుకొంటున్నారు. కారణమేదైనా సినిమా కొన్నాళ్లుగా ఆగిపోయింది మాత్రం వాస్తవం. అయితే ఇప్పుడు సమస్యలన్నీ సర్దుబాటు కావడంతో మళ్లీ షూటింగ్ ని షురూ చేయాలని చిత్రబృందం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. బుధవారం నుంచి ఐటెమ్ పాటతో సినిమా షూటింగ్ మొదలవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ పాటలో పవన్ తోపాటు, లక్ష్మీరాయ్ పాల్గొంటుంది.
జయనన్ కే సర్దిచెప్పి ఆయనతోనే షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారని తెలిసింది. మరి అది నిజమో కాదో...సెట్స్ లోనే తెలుస్తుంది. సినిమా గురించి రకరకాలుగా ప్రచారం సాగుతుండడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైందట. పవన్ కళ్యాణ్ ఆఫీసుకు కూడా ఫోన్ చేసి సినిమా గురించి అడిగారట. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పుకార్లన్నింటికీ స్పందించాల్సిన అవసరం లేదని, మన పని మనం చేసుకెళ్దామని, పాట షూటింగ్ మొదలయ్యాక ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చెయ్యండని నిర్మాతల్ని కోరాడట. ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేసి జనవరిలో తీసుకురావల్సిందే అని చెబుతున్నాడట. కానీ షూటింగ్ ఇలా సాగితే జనవరిలో ఆ సినిమా రావడం కష్టమనీ, సమ్మర్ కే పవన్ కళ్యాణ్ సందడి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బాబీ దర్శకత్వంలో వహిస్తున్న `సర్దార్ గబ్బర్ సింగ్`లో పవన్ సరసన కాజల్ నటిస్తోంది. ఇప్పటికీ కీలకమైన ఎపిసోడ్స్ తెరకెక్కించారు. నిజానికి సినిమా వేగంగానే పూర్తవుతోందట. బాబీ పక్కా స్క్రిప్టుతో సిద్ధం కావడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయట. అయితే యూనిట్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ దగ్గరే అసలు సమస్య వచ్చిందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. గబ్బర్ సింగ్ సీక్వెల్ అంటూ ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పట్నుంచో మాట్లాడుకుంటున్నారు. వాళ్లని నిరాశపరచకూడదంటే సినిమాని వేగంగా పూర్తి చేయాల్సిందే. అందుకే పవన్ కూడా ఆరు నూరైనా, నూరు ఆరైనా ఈ సినిమాని వేగంగా ఫినిష్ చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్నాడని తెలిసింది.