Begin typing your search above and press return to search.

సర్దార్ గురించి ఎవరూ నమ్మట్లేదు

By:  Tupaki Desk   |   24 Sep 2015 4:29 AM GMT
సర్దార్ గురించి ఎవరూ నమ్మట్లేదు
X
ఏడాదికి పైగా ఏర్పాట్లు జరిగాక మొదలైన పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్.. అంతలోనే ఆగిపోయింది. మళ్లీ సర్దార్ షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలువుతుందనే ఆతృత ఫ్యాన్స్ లో చాలానే ఉంది. సంక్రాంతికి కంగారేంటని పవన్ అన్నాడని, ఇంకా కొత్త సినిమాటోగ్రాఫర్ ని పవన్ ఫైనల్ చేయలేదని, షూటింగ్ పై పవర్ స్టార్ ఇంట్రెస్ట్ చూపడం లేదని, పవన్ కు వెన్నునొప్పిగా ఉండడంతో రెస్ట్ తీసుకుంటున్నాడని.. ఇలా చాలానే వార్తలొస్తున్నాయి.

ఇన్ని రూమర్స్ వస్తున్నా సర్దార్ కి సంబంధించిన యూనిట్ లో ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. దీంతో ఎవరికి తోచినట్లు వాళ్లు రాసేసుకుంటున్నారు. వాస్తవానికి సర్దార్ షూటింగ్ రెండు రోజుల గ్యాప్ లోనే మొదలైపోయిందని తెలుస్తోంది. సినిమాటో గ్రాఫర్ ఆర్థర్ విల్సన్ వచ్చి.. సర్దార్ టీం జాయిన్ అయిపోయాడట. షూటింగ్ కూడా శరవేగంగా కానిచ్చేస్తున్నారని టాక్. వీలైనంత త్వరగా సర్దార్ ని సిల్వర్ స్క్రీన్ కి సిద్ధం చేసేందుకు.. డైరెక్టర్ బాబి బాగానే కృషి చేస్తున్నాడు. మరి ఇంత జరుగుతున్నా.. సర్దార్ షూటింగ్ గురించి ఎవరూ నమ్మడం లేదు.. ఎందుకనో ?

కె.ఎస్‌.రవీంద్ర డైరక్షన్‌ లో రూపొందుతున్న ''సర్దార్‌'' కోసం ఈ దర్శకుడితో కలసి మరో రచయిత సాయి మాధవ్‌ బుర్రా కూడా మాటలు అందిస్తున్నారు. యథావిథిగా దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌. స్టార్‌ హీరోయిన్‌ కాజల్ తొలిసారి పవన్‌ సరసన నటిస్తోంది. అనుకున్నట్లే 2016 సంక్రాంతికి రిలీజ్‌ అయితే ఇక సూపరే.