Begin typing your search above and press return to search.

సర్దారూ.. ఏందయ్యా నీ క్రేజు?

By:  Tupaki Desk   |   15 March 2016 1:30 PM GMT
సర్దారూ.. ఏందయ్యా నీ క్రేజు?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతోంది అంటే ఆ హంగామా ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. సినిమా రిలీజ్ కు నెల రోజుల ముందే మొదలైపోతుంది అభిమానుల రచ్చ. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభిమానుల మేనియా మామూలుగా ఉండదు. వీళ్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా కొన్ని రోజులుగా కొత్త కొత్త పోస్టర్లు వదలడమే కాక.. మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసి కాక రేపింది ‘సర్దార్..’ టీమ్. దీంతో ట్విట్టర్ - ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ హాట్ టాప్ అవుతోంది. గత ఐదు రోజులుగా హైదరాబాద్ టాప్ ట్రెండ్స్ లిస్టు నుంచి పక్కకే వెళ్లలేదు ‘సర్దార్ గబ్బర్ సింగ్’.

మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన రోజంతా నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అనే హ్యాష్ ట్యాగ్.. ఆ తర్వాతి మూడు రోజులు కూడా టాప్-10 ట్రెండింగ్ టాపిక్స్ లో కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ ఆ హ్యాష్ ట్యాగ్ జోరు తగ్గలేదు. అంటే నాలుగు రోజులుగా పవర్ స్టార్ అభిమానులు.. సర్దార్ చర్చను వదలట్లేదన్నమాట. ఇక ఈ ఒక్క రోజు కూడా అలాగే చర్చ కొనసాగిందంటే.. ఇక రేపట్నుంచి ఇక కష్టపడాల్సిన పని లేదు. బుధవారం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో టీజర్ రిలీజవ్వబోతోంది. కాబట్టి ఉదయం నుంచి హంగామా మొదలైపోతుంది. ఈ టాపిక్ నెంబర్ వన్ స్థానానికి వచ్చేస్తుంది. టీజర్ ఊపు ఎలాగూ రెండు మూడు రోజులుంటుంది. ఆ తర్వాత ఆదివారం ఆడియో ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ హంగామా వేరుగా ఉంటుంది. మొత్తానికి టాప్ ట్రెండ్స్ లిస్టులోంచి ‘సర్దార్..’ అంత ఈజీగా పక్కకు తప్పుకునేలా లేదు.