Begin typing your search above and press return to search.

ఇద్దరు మాస్ పోలీసులు.. ఒకే రోజు రచ్చ

By:  Tupaki Desk   |   14 March 2016 1:30 PM GMT
ఇద్దరు మాస్ పోలీసులు.. ఒకే రోజు రచ్చ
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ కి.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు వచ్చే ఆదివారం, అంటే మార్చ్ 20న డేట్ సెట్ చేశారనే విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమైపోయాయి. ఇప్పుడు అదే డేట్ కు ఆడియో విడుదల చేసేందుకు మరో స్టార్ హీరో డిసైడైపోయాడు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా.. తన మూవీ 'తెరి' పాటలను 20వ తేదీనే విడుదల చేయబోతున్నాడు. ఈ విషయాన్ని రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని, నేను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ ని అని ఓపెన్ గానే చెప్పే విజయ్.. ఇలా అదే రోజుకు పాటలను విడుదల చేయాలని నిర్ణయించడం విశేషమే అని చెప్పాలి. నిజానికి సినిమాల ఎంపిక విషయంలో పవన్ - విజయ్ ల మధ్య సారూప్యతలు కనిపిస్తాయి. గతంలో ఒకరి సినిమాని మరొకరు రీమేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరిద్దరి మధ్యా అఫీషియల్ గా అటాచ్ మెంట్ గా లేకపోయినా.. ఐడియాలజీ మాత్రం ఇద్దరిదీ ఒకటే అనే టాక్ ఉంది.

ప్రస్తుతం పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, విజయ్ నటించిన తెరి చిత్రాల్లో.. ఇద్దరూ పోలీస్ పాత్రలనే చేయడం విశేషమే. గతంలోనే గబ్బర్ సింగ్ ను పోలిన సీన్స్ తెరిలో ఉన్నాయంటూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా కూడా చేశారు. మరి ఈ ఇద్దరు పోలీసులు బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తారో!