Begin typing your search above and press return to search.

కాస్ట్లీ కార్ బ‌హుమ‌తిగా అందుకున్న‌ కార్తి డైరెక్ట‌ర్!

By:  Tupaki Desk   |   2 Nov 2022 10:30 AM GMT
కాస్ట్లీ కార్ బ‌హుమ‌తిగా అందుకున్న‌ కార్తి డైరెక్ట‌ర్!
X
క‌రోనా త‌రువాత ప్రేక్ష‌కుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ వున్నా స‌రే కంటెంట్ వున్న సినిమాల‌కే ప్రేక్ష‌క‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అనువాద చిత్ర‌మా..స్ట్రెయిట్ సినిమా అనే భేధం చూడ‌టం లేదు. కంటెంట్ న‌చ్చితే అనువాద సినిమా అయినా స‌రే అక్కున చేర్చుకుంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో కంటెంట్ ప్ర‌ధానంగా రూపొంది తెలుగులో విడుద‌లైన అనువాద సినిమాలు మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతుండ‌ట‌మే కాకుండా మంచి విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నాయి.

ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంటున్నాయి. క‌న్న‌డ అనువాద సినిమా 'కాంతార‌' త‌రువాత తెలుగులో విడుద‌లై మంచి టాక్ ని సొంతం చేసుకున్న మూవీ 'స‌ర్దార్‌'. కార్తి హీరోగా ద్వి పాత్రాభిన‌యం చేసిన యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ఇది. ఈ మూవీని పీఎస్ మిత్ర‌న్ తెర‌కెక్కించారు. రాశీఖ‌న్నా, ర‌జీషా విజ‌య‌న్ హీరోయిన్ లుగా న‌టించ‌గా ఒక‌నాటి హీరోయిన్ లైలా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని తెలుగులో అన్న‌పూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేసింది.

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ హీరో కార్తి కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. దేశం కోసం త‌న కుటుంబాన్నే ప‌ణంగా పెట్టిన ఓ స్పై క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా పెను ప్ర‌మాదంగా మార‌నున్న నీటి వ్యాపారం వెన‌కున్న షాకింగ్ విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టి సామాన్యుడితో పాటు అన్ని వ‌ర్గాల వారిని షాక్ కు గురిచేసింది.

సినిమాకు తెలుగుతో పాటు త‌మిళంలోనూ మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న నేప‌థ్యంలో చిత్ర నిర్మాత ప్రిన్స్ పిక్చ‌ర్స్ అధినేత ఎస్‌. ల‌క్ష్మ‌ణ్ కుమార్ చిత్ర ద‌ర్శ‌కుడు పీఎస్ మిత్ర‌న్ కు ఓ కాస్ట్లీ కార్ ని బ‌హుమ‌తిగా అందించ‌డం విశేషం.

ఈ కార్ ని హీరో కార్తి చేతుల మీదుగా ద‌ర్శ‌కుడు పీఎస్ మిత్ర‌న్ కు నిర్మాత అంద‌జేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ద‌ర్శ‌కుడు పీఎస్ మిత్ర‌న్ కు కార్ కీస్ ని అందించిన కార్తీ ఆ త‌రువాత అత‌న్ని ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకున్నారు.

'స‌ర్దార్‌' కు త్వ‌ర‌లో సీక్వెల్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. కాంబోడియా నేప‌థ్యంలో సీక్వెల్ ని త్వ‌ర‌లె తెర‌పైకి తీసుకురానున్నామంటూ చిత్ర బృందం ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.