Begin typing your search above and press return to search.

‘సర్దార్’ మేనియా మొదలైపోయింది

By:  Tupaki Desk   |   3 April 2016 10:21 AM GMT
‘సర్దార్’ మేనియా మొదలైపోయింది
X
స్టార్ హీరోల సినిమాలు వచ్చాయంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే రచ్చకు హద్దులుండవు. పవన్ సినిమా విడుదలవుతోందంటే.. ఒక రకమైన మ్యాడ్ నెస్ లో ఉంటారు అభిమానులు. ఆ తిక్కను మాటల్లో కొలవలేం. పవన్ సినిమా విడుదలను ఓ పండగలాగా భావిస్తారు ఫ్యాన్స్. వారం రోజుల ముందు నుంచే రిలీజ్ నాటికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఇందులో భాగంగా ఆల్రెడీ సర్దార్ టాటూల సందడి కనిపిస్తోంది. ఇప్పడు సర్దార్ టీషర్టులు కూడా రెడీ అవుతున్నాయి.

పవన్ గుర్రం మీద దూసుకొస్తున్న ఫొటో ముద్రించి.. ‘ది పవర్ ఆఫ్ వన్’ అనే క్యాప్షన్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీషర్టులు రెడీ చేశారు అభిమానులు. సోషల్ మీడియాలో ఈ టీషర్టుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకూ ఈ టీషర్టుల్ని తరలించి అభిమానులకు అమ్ముతారట. విడుదల రోజు థియేటర్ల దగ్గర పవన్ అభిమానగణమంతా ఈ టీషర్టుల్లోనే కనిపించే అవకాశముంది. ఇప్పటికే పవన్ వాడే ఎర్ర రుమాలుతో అభిమానులు సందడి చేస్తున్నారు. ఆడియో విడుదలకు వేల మంది అభిమానులు ఎర్ర రుమాలుతో వచ్చారు. ఇక విడుదల రోజు సర్దర్ టీషర్టుల హంగామా కనిపించబోతోందన్నమాట.