Begin typing your search above and press return to search.

బంజారాహిల్స్ పోలీసుల అదుపులో సరయూ.. తర్వాతేమైంది?

By:  Tupaki Desk   |   8 Feb 2022 4:29 AM GMT
బంజారాహిల్స్ పోలీసుల అదుపులో సరయూ.. తర్వాతేమైంది?
X
నోటికి వచ్చినట్లు మాట్లాడటం భావస్వేచ్ఛగా చెప్పుకోవటం వరకు బాగానే ఉంటుంది. ఇంగ్లిషులో తిట్టే తిట్లను అచ్చ తెలుగులో తిడుతున్నాం.. దానికై అంతలా అయిపోవాలా? అంటూ పిడి వాదనతో పాటు.. అందరు నడిచే దారిలో నడవకుండా పచ్చి బూతులతో చిట్టి వీడియోల్ని చేస్తూ.. తాము చెప్పాల్సిందంతా తాము అనుకున్నట్లుగా మసాలా దట్టించి మరీ చెప్పేస్తూ.. చివర్లో సందేశాన్ని ఇచ్చే వీడియోలతో ఫేమస్ అయిన వారిలో సరయూ ఒకరు.

సెవన్ ఆర్ట్స్ కల్ట్ పేరుతో తయారు చేసే వీడియోలలో నటించిన ఆమె చాలా తక్కువ వ్యవధిలోనే పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. ఆమెను.. ఆమె స్టైల్ ను పొగిడేటోళ్లు ఎంతమందో..తిట్టిపోసేటోళ్లు అంతకు రెట్టింపుగా ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 5లో ఎంపికై.. మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు.

ఇదంతా బాగానే ఉన్నా.. తాజాగా ఒక కేసు ఆమెను చుట్టుకుంది. అందులో సరయూతో పాటు.. ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. సోమవారం ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? కేసు చిక్కుల్లో ఆమె ఎందుకు చిక్కుకున్నారన్నది చూస్తే.. . ‘7 ఆర్ట్స్‌’ పేరుతో నడుపుతున్న చానల్ నడుపుతున్న సరయూ స్నేహితులు సిరిసిల్లలో . 7 ఆర్ట్స్‌ ఫ్యామిలీ పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించారు.

ఈ హోటల్ ప్రమోషన్ కోసం ఒక చిట్టి వీడియోను వదిలారు. అందులో గణపతి బప్పా మోరియా బ్యాండ్ ను తలకు ధరించి.. దేవుడి బొమ్మలతో సరయూ.. ఆమె స్నేహితులు మద్యం సేవించి హోటల్ ను సందర్శించినట్లుగా ఉండేలా వీడియోను చేశారు. దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావటం.. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందువులు.. మహిళల్ని కించపరిచేలా ఈ షార్ట్ ఫిలిం ఉందన్న మండిపాటు వ్యక్తమైంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ సిరిసిల్ల అధ్యక్షుడు అశోక్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

కేసు విచారణలో.. ఈ షార్ట్ ఫిలింను బంజారాహిల్స్ లో నిర్మించినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో.. కేసును బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ కు బదిలీ చేశారు. ఈ క్రమంలో సరయూ.. ఆమె స్నేహితుల్ని (క్రష్ణ మోహన్.. శ్రీకాంత్ రడె్డి.. కార్తిక్) బంజారాహిల్స్ పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. అనంతరం వారిని విచారించిన పోలీసులు సీఆర్పీపీసీలోని సెక్షన్41 కింద నోటీసులు ఇచ్చి పంపారు. విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలన్నారు. అయితే.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ సరయూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. అరెస్టు చేశారని.. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు ప్రచారం చేశారు. కానీ.. జరిగింది మాత్రం విచారించి పంపారంతే.