Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాలో ఆ తమిళ హీరో

By:  Tupaki Desk   |   7 Jun 2017 9:44 AM GMT
మహేష్ సినిమాలో ఆ తమిళ హీరో
X
రైటర్ టర్న్డ్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాల్లో హీరోది మాత్రమే కాదు.. మిగతా క్యారెక్టర్లు కూడా చాలా బలంగా ఉండటం గమనించవచ్చు. విలన్ తో పాటుగా ఓ సీనియర్ నటుడితో కీలక పాత్రలు వేయించడం కొరటాలకు అలవాటు. ఆ క్యారెక్టర్లు భలే హైలైట్ అవుతుంటాయి. దర్శకుడిగా తన తొలి సినిమా ‘మిర్చి’లో సత్యరాజ్ తో అలాంటి పాత్రే చేయించారు. ఆ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది. ‘శ్రీమంతుడు’లో జగపతిబాబు.. రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి కీలక పాత్రలే వేశారు. అవి కూడా సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. మూడో సినిమా ‘జనతా గ్యారేజ్’లో మోహన్ లాల్ తో ఇంకా పెద్ద పాత్ర వేయించారు. అది సినిమాకు పెద్ద బలంగా నిలిచింది.

ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ‘భరత్ అను నేను’లో కూడా ఇలాంటి సెటప్ ఒకటి పెట్టుకున్నాడట కొరటాల. ఓ కీలక పాత్ర కోసం తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ ను తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ పాత్ర కథను మలుపు తిప్పేలా ఉంటుందట. శరత్ కుమార్ ‘బన్నీ’ లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. ఈ మధ్య రాజకీయాల్లో దెబ్బ తిని.. సినిమాల వైపు చూస్తున్నాడు శరత్. మహేష్ బాబు-కొరటాల కాంబినేషన్లో సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా ఈ అవకాశాన్ని ఓకే చేశారట శరత్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. మహేష్ త్వరలోనే షూటింగుకి వస్తాడు. ఆలోపు వేరే నటీనటులతో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు కొరటాల. ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/