Begin typing your search above and press return to search.

'ఆదిత్య మ్యూజిక్' మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో 'సారంగ దరియా'

By:  Tupaki Desk   |   6 April 2021 5:17 AM GMT
ఆదిత్య మ్యూజిక్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో సారంగ దరియా
X
సౌత్ ఇండియాలోని అగ్ర‌గామి మ్యూజిక్ కంపెనీలలో ఒకటైన ఆదిత్య మ్యూజిక్.. ఎప్పటికప్పుడు ఎంగేజింగ్ కంటెంట్ ని వీక్షకులకు అందిస్తూ సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. ఆదిత్య మ్యూజిక్ లేబుల్ ద్వారా అప్లోడ్ చేయబడుతున్న తెలుగు సాంగ్స్ పాన్ ఇండియా లెవల్ లో ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇప్పటికే అనేక మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందించి మిలియన్ల కొలదీ వ్యూస్ రాబట్టిన ఈ మ్యూజిక్ కంపెనీ.. రీసెంట్ గా మరో చార్ట్ బస్టర్ 'సారంగ దరియా' పాటతో వచ్చింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ అందుకొని ఆదిత్య మ్యూజిక్ లేబుల్ వారి వంద మిలియన్ సాంగ్స్ క్లబ్ లో జాయిన్ అయింది.

అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం ''లవ్ స్టోరీ''. ఈ సినిమా నుంచి తెలంగాణ జానపదం నేపథ్యంలో సాగిన 'సారంగ దరియా' పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయబడింది. ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా అలరోస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ స్వరపరిచిన ట్యూన్ కి సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం.. గాయని మంగ్లీ పాడిన తీరు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో 'సారంగదరియా' అతి తక్కువ టైంలో 100 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లై 100 మిలియ‌న్లకు పైగా వ్యూస్ ద‌క్కించుకున్న పాటల వివ‌రాలు ఒక్కసారి చూస్తే.. 'అల‌ వైకుంఠ‌పురంలో' సినిమాలోని 'బుట్ట‌బొమ్మ' పాట 575 మిలియ‌న్ల వ్యూస్ తో టాప్ లో నిలిచింది. ఇదే సినిమాలోని 'రాములో రాములా' - 353 మిలియ‌న్లు.. 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' లిరిక‌ల్ సాంగ్ - 227 మిలియన్ల వ్యూస్ రాబట్టాయి. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న ఫుల్ సాంగ్ ను 173 మిలియ‌న్ల మంది చూసారు. అలానే 'ఫిదా' చిత్రంలోని 'వ‌చ్చిందే' పాట 295 మిలియ‌న్ల వ్యూస్ తో 300 మిలియన్ క్లబ్ కు దగ్గర్లో ఉంది. 2021లో సూపర్ హిట్ అయిన 'ఉప్పెన' సినిమాలోని 'నీ క‌ళ్లు నీలి స‌ముద్రం' సాంగ్ - 204 మిలియ‌న్లు.. 'డీజే' మూవీలోని 'సీటిమార్' - 202 మిలియ‌న్లు వ్యూస్ అందుకున్నాయి.

'ఛ‌లో' చిత్రంలోని 'చూసి చూడంగానే' గీతం 169 మిల‌యిన్లు.. 'ఎమ్ సి ఏ' సినిమాలోని 'ఏవండోయ్ నాని గారు' పాట 118 మిలియ‌న్ల వ్యూస్ తో ఉన్నాయి. ఇక 'గీతగోవిందం' చిత్రంలోని 'ఇంకేం ఇంకేం కావ‌లే' వీడియో ఎడిట్ వెర్ష‌న్ సాంగ్- 115 మిలియ‌న్లు.. 'ఇంకేం ఇంకేం కావ‌లే' లిరిక‌ల్ సాంగ్ - 108 మిలియ‌న్లు.. 'వ‌చ్చింద‌మ్మ' పాట -108 మిలియ‌న్లు.. 'ఏంటి ఏంటి' గీతం 102 మిలియ‌న్ల వ్యూస్ రాబట్టాయి. ఈ క్రమంలో తాజాగా 'ల‌వ్ స్టోరీ' చిత్రంలోని 'సారంగ‌దరియ' పాట 101 మిలియ‌న్ల వ్యూస్ తో ఆదిత్య మ్యూజిక్ వారి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చేరింది. త్వరలోనే 'శశి' చిత్రంలోని 'ఒకే ఒక లోకం నువ్వే' పాట కూడా ఈ జాబితాలో చేరబోతోంది.