Begin typing your search above and press return to search.

పంజా బ్యూటీ నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ లుక్

By:  Tupaki Desk   |   1 April 2021 5:06 PM IST
పంజా బ్యూటీ నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ లుక్
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న పంజా చిత్రంలో నాయిక‌గా న‌టించింది సారా జేన్ డ‌యాస్. ఆరంభ‌మే క్రేజీ ఆఫ‌ర్.. దాంతో ఈ అమ్మ‌డు ఓ వెలుగు వెలుగుతుంద‌నే అనుకున్నారు. కానీ ఆ సినిమా ఫ్లాప‌వ్వ‌డంతో తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి క‌నుమ‌రుగైంది. టాలీవుడ్ కోలీవుడ్ లో ఎంత‌ ప్ర‌య‌త్నించినా స‌రైన ఆఫ‌ర్లు రాలేదు.

ప్ర‌స్తుతం కొంత గ్యాప్ త‌ర్వాత తిరిగి ఇరు ప‌రిశ్ర‌మ‌ల్లో కంబ్యాక్ కోసం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. తాజాగా సారా షేర్ చేసిన హాట్ ఫోటో వైర‌ల్ గా మారింది. ఇంత‌కుముందు సారా 15 సెక‌న్ల స్కిప్పింగ్ వీడియో అంతే వేగంగా క్లిక్ లు లైక్ ల‌తో వైర‌ల్ అయ్యింది. తాజా ఫోటోషూట్ లో నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ తో బోల్డ్ గా క‌నిపిస్తోందంటూ అభిమానులు వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు. ఈ బ్యూటీ సిన్సియ‌ర్ ప్ర‌య‌త్నం చూసాక అయినా మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఒక్క ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

సారా జేన్ నేప‌థ్యం ప‌రిశీలిస్తే... గ‌ల్ఫ్ లో స్ట‌డీస్ పూర్తి చేసుకుని అటుపై బాలీవుడ్ పై మ‌న‌సు ప‌డి రంగ ప్ర‌వేశం చేసింది. మస్కట్ లోని ఆయిల్ ‌ఫీల్డ్స్ సరఫరా కేంద్రం లో ప‌ని చేసే యోలాండా డయాస్ మార్కెటింగ్ మేనేజర్ యూస్టేస్ డయాస్ వార‌సురాలు సారా. ముంబైలోని మిథిబాయి కాలేజీతో పాటు బాంద్రాలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో స్ట‌డీస్ త‌ర్వాత మిస్ ఒమ‌న్ గా ఎంపికైంది. ముంబైలో డయాస్ ను యాధృచ్చికంగా సురేష్ నటరాజన్ తన సెట్ లోకి వెళ్ళినప్పుడు చూసి ఎంపిక చేశారు. అలా 21 వ‌య‌సులో ఛానల్ V ట్రావెల్ షో అయిన ఆన్ ది రన్ లో ఆమె మొదట అతిథిగా క‌నిపించింది. తరువాత ఛానల్ V లో సూపర్ మోడల్ వేట అయిన `గెట్ జార్జియస్`కి హోస్ట్ అయ్యింది. క్రాస్ఓవర్ చిత్రం `బ్రైడ్స్ వాంటెడ్` (2006) లో వధువు వేటలో ఉన్న వ‌రుడికి సహాయపడే బెస్ట్ ఫ్రెండ్ పాత్ర పోషించింది.