Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఏక్ దమ్ సూపర్ హాట్

By:  Tupaki Desk   |   26 Jun 2019 4:19 PM IST
ఫోటో స్టోరీ: ఏక్ దమ్ సూపర్ హాట్
X
సారా జేన్ డయాస్ పేరును తెలుగు ప్రేక్షకులకు కనీసం ఒకసారైనా విని ఉంటారు. కారణం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పంజా' సినిమాలో సారా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో నటించలేదు. బాలీవుడ్ లో అర డజను సినిమాల్లో నటించింది కానీ అవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయో ఎప్పుడు టపా కట్టాయో ఎవరికీ తెలీదు. సినిమా కెరీర్లో పెద్దగా విజయం సాధించలేకపోయింది కానీ సారా లైఫ్ ను ఎంజాయ్ చెయ్యడంలో స్పెషలిస్టు. అంతే కాదు హాటు ఫోటోలను అప్లోడ్ చేసి టెంపరేచర్ పెంచే ఘాటు యాక్టివిస్టు.

రెగ్యులర్ గా తన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. తనకున్న 213k ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లను మురిపిస్తూ ఉంటుంది. ఓ నాలుగు రోజుల క్రితం ఈ భామ ఇండోనేషియా దేశంలో హాలిడే జాలీ డేస్ గడుపుతూ ఉంది. ఆ దేశంలోని బాలీ ఐలాండ్ లోని బాలీ సర్ఫ్ అండ్ యోగా రిట్రీట్స్ రిసార్టులో ఫుల్ గా చిల్ అవుట్ అయింది. ఆ సమయంలో తీసిన ఒక బికినీ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "టాలెంట్ ను హార్డ్ వర్క్ ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి" అంటూ సారా క్యాప్షన్ ఇచ్చింది.

అసలే 2 పీస్ బికినీ.. తీరుగా ఉన్న ఒంపుసొంపులు ఈ ఫోటోను చూస్తే ఎవరైనా ఈ భామకు 36 ఏళ్ళ వయసని అనుకోగలరా..పైన క్యాప్షన్లో తన టాలెంట్ ను తక్కువ అంచనా వెయ్యోద్దని చెప్పింది అందుకేనేమో! కఠినమైన కసరత్తులు చేసి స్లిమ్ముగా..సెక్సీ బికినీ ఫిగర్ మెయింటెయిన్ చెయ్యడమే ఆమె టాలెంట్. అన్నట్టు ఈ భామ ఇంకా పెళ్ళి కూడా చేసుకోలేదు. అందుకే ఫుల్ గా చిల్ అవుట్ అవుతూ ఉంది. ఈ ఫోటోలకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు నెటిజన్లు. "హాట్ హాటర్ హాటెస్ట్ బికినీ".. "క్రేజీ బికిని.. సెక్సీ నేవల్".. "ఏక్ దమ్ సూపర్ హాట్" అంటూ కామెంట్లు పెట్టారు.