Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : పవన్ బ్యూటీ బికినీ ట్రీట్‌

By:  Tupaki Desk   |   4 Oct 2021 1:30 AM GMT
ఫొటోటాక్ : పవన్ బ్యూటీ బికినీ ట్రీట్‌
X
పవన్‌ కళ్యాణ్ పంజా చిత్రంలో హీరోయిన్‌ గా నటించిన సారాహ్‌ జైన్ అందాల ఆరబోతలో ఎప్పుడు కూడా వెనుకంజ వేయదు. వరుసగా సోషల్‌ మీడియాలో హాట్ ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో సారా జైన్‌ హాట్ ఫొటోలను షేర్‌ చేసింది. బికినీలో ఇప్పటికే పలు సార్లు హాట్ ఫొటోలను షేర్‌ చేసిన ఈ అమ్మడు ఈసారి ఈసారి షేర్‌ చేసిన బికినీ ఫొటో మరింతగా ఆమె అందాన్ని ఆరబోస్తుంది అనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ తో నటించిన పంజా సినిమాలో సారాహ్ జైన్ చాలా పద్దతిగా అందంగా కనిపించింది. కాని ఆమెను ఇలా చూసిన పవన్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈమె ఆమేనా అంటూ ముక్కున వేలేసుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదని.. ఫిజిక్ విషయంలో ఈ అమ్మడు ఎంతో జాగ్రత్త పాటిస్తుందని అందుకే ఎప్పుడు కూడా చాలా అందంగా ఆకట్టుకునే లుక్ లో కనిపిస్తుందని నెట్టింట ఈమె గురించి వార్తలు వస్తూ ఉంటాయి. సినిమాలు వెబ్‌ సిరీస్ ల్లో నటించిన ఈమె ఈమద్య కాలంలో సినిమాలకు కాస్త దూరం ఉంటూ వస్తోంది. ఆఫర్లు వస్తున్నా కూడా కొన్ని కారణాల వల్ల దూరం పెడుతూ ఉన్న ఈమె మళ్లీ హీరోయిన్‌ గా సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇటీవల వచ్చిన తాండవ్ వెబ్‌ సిరీస్ లో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఎమోషన్స్ ను పండించడంలో ఈమె సక్సెస్ అయ్యింది. తాండవ్‌ తర్వాత మళ్లీ నటిగా ఒకొక్కటి చొప్పున ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే ఈమె కొత్త సినిమా గురించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అందాల ఆరబోస్తున్న ఈ అమ్మడు ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటన ప్రతిభను కూడా కలిగి ఉంటుంది. కనుక సెకండ్‌ ఇన్నింగ్స్ లో ఈ అమ్మడు మళ్లీ రెచ్చి పోవడం ఖాయం అంటున్నారు.