Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ కంటికి గాయం

By:  Tupaki Desk   |   15 Oct 2020 10:00 AM IST
బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ కంటికి గాయం
X
ప్రస్తుతం తెలుగు.. తమిళ బిగ్ బాస్‌ లు మాత్రమే కాకుండా హిందీ బిగ్ బాస్‌ కూడా సాగుతోంది. హిందీ బిగ్‌ బాస్‌ ప్రస్తుతం 14వ సీజన్‌ నడుస్తోంది. రెండవ వారంలోకి హిందీ బిగ్‌ బాస్‌ అడుగు పెట్టింది. మొదటి వారంలోనే పంజాబీ సింగర్‌ మరియు నటి అయిన సారా గుర్పాల్‌ ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె ఎలిమినేషన్‌ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఓట్లు బాగానే పడ్డా ఎలిమినేట్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో కొందరు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెను ఓట్ల ఆధారంగా కాకుండా అనారోగ్య కారణాల వల్ల ఎలిమినేట్‌ చేసినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మొదటి వారం ఇమ్యూనిటీ టాస్క్‌ లో భాగంగా సారా గుర్పాల్‌ బుల్డోజర్‌ ఎక్కి కూర్చుంది. దాని నుండి ఆమెను దించేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించారు. ఆమెను కిందకు దించేందుకు గాను మరో కంటెస్టెంట్‌ అయిన నిక్కీ తంబోలి కళ్ల వద్ద గోర్లతో రక్కింది. ఆ విషయాన్ని టెలికాస్ట్‌ చేయలేదు. కాని ఆ తర్వత ఇంటి సభ్యులు మాట్లాడుకున్న దాని ప్రకారం నిక్కీ రక్కినట్లుగా తెలింది. ఇక సారా బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో ఆమె కంటికి గాయం అయ్యింది. ఆసుపత్రిలో చికిత్స కూడా పొందింది.

కంటికి సంబంధించిన ఇబ్బంది కారణంగానే ఆమెను ఎలిమినేట్‌ చేసి ఉంటారు అంటున్నారు. సారా ఈ విషయంలో నిక్కీని ఎక్కడ కూడా విమర్శించక పోవడం విశేషం. సారా ఎలిమినేషన్‌ ను చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో పంపిస్తారని ఆశిస్తున్నాం అంటున్నారు. మరి సల్మాన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి. హిందీ బిగ్ బాస్‌ కు సంబంధించిన ఎక్కువ శాతం కీలక నిర్ణయాలను సల్మాన్‌ తీసుకుంటాడనే టాక్‌ ఉంది. మరి ఈ విషయంలో ఆయన నిర్ణయం ఏంటో మరి..?