Begin typing your search above and press return to search.

నీ పట్టుదలకు హ్యాట్సాఫ్‌ సారా

By:  Tupaki Desk   |   29 Jan 2020 4:31 AM GMT
నీ పట్టుదలకు హ్యాట్సాఫ్‌ సారా
X
ప్రస్తుతం బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ సారా అలీఖాన్‌. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ మొదటి భార్య కూతురు అయిన సారా అలీఖాన్‌ హీరోయిన్‌ గా వరుస చిత్రాల్లో నటిస్తూ సక్సెస్‌ లు దక్కించుకుంటుంది. చూడ్డానికి అందంగా.. కరెక్ట్‌ ఫిగర్‌ తో ఈ అమ్మడు కుర్ర హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా ఉంటూ.. కుర్ర ప్రేక్షకుల కలల రాణిగా కొనసాగుతుంది. ఇదంతా ప్రస్తుతం కాని ఒకప్పుడు సారా అలీ ఖాన్‌ ఎలా ఉండేదో కనీసం మీరు ఊహించనుకూడా లేరు.

సోషల్‌ మీడియా లో చాలా యాక్టివ్‌ గా ఉండే సారా అలీ ఖాన్‌ తాజాగా ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఒక బొద్దు అమ్మాయి విమానంలో తన స్నేహితురాళ్లను ఆట పట్టిస్తూ ఉంది. వారు పడుకుని ఉండగా వారి వీడియోలు చిత్రీకరిస్తూ అల్లరి చేస్తుంది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ బొద్దుగా ఉన్న అమ్మాయి మరెవ్వరో కాదు సారా అలీ ఖాన్‌. అప్పట్లో సారా అలీఖాన్‌ దాదాపుగా 96 కేజీలు ఉండేదట. హీరోయిన్‌ గా మారాలనే పట్టుదలతో బరువు తగ్గింది.

విదేశాల్లో చదువు పూర్తి చేసిన తర్వాత తల్లితో తాను హీరోయిన్‌ అవ్వాలనుకుంటున్నాను అంటూ చెప్పిందట. అప్పటికే బరువు బాగా ఉండటంతో బరువు తగ్గితే తప్పకుండా హీరోయిన్‌ అవ్వొచ్చు అంటూ సూచించిందట. విదేశాల్లో అడ్డదిడ్డమైన ఫుడ్‌ తిని ఫిజిక్‌ పై అసలు దృష్టి పెట్టక పోవడంతో బరువు పెరిగిన సారా ఎప్పుడైతే హీరోయిన్‌ గా అవ్వాలనుకుందో అప్పటి నుండి పట్టుదలతో బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాంతో ఈ అమ్మడు బరువు తగ్గింది. దాదాపుగా 30 నుండి 35 కేజీల బరువును తగ్గినట్లుగా తెలుస్తోంది. అంత బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. అందుకే నీ పట్టుదలకు హ్యాట్సాఫ్‌ అంటూ అభినందిస్తున్నారు.