Begin typing your search above and press return to search.

ఖాన్ కూతురు షాక్ ఇచ్చిందిగా

By:  Tupaki Desk   |   6 April 2016 9:30 AM GMT
ఖాన్ కూతురు షాక్ ఇచ్చిందిగా
X
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సైఫ్ ఆలీ ఖాన్ ఒకడు. తను హీరోగా ఇప్పటికీ ఇరగదీసేస్తున్నా.. ఈ బాలీవుడ్ ఖాన్ కి హీరోయిన్ ఏజ్ ఉన్న కూతురుంది. ఈమె పేరు సారా ఖాన్. ఈ కుర్రదాన్ని కూడా హీరోయిన్ చేసేస్తారనే టాక్ చాలాకాలంగానే బాలీవుడ్ లో వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ అంటే కంపల్సరీగా కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిందే. అందులో ప్రధానమైనది స్లిమ్ లుక్.

బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన బొద్దు భామలను వేళ్లపై లెక్క పెట్టచ్చు. ఒకవేళ మొదట్లో సక్సెస్ వచ్చినా - తర్వాత దాన్ని నిలబెట్టుకునేందుకు తప్పనిసరిగా సన్నబడాల్సిందే. సోనాక్షి సిన్హా - సోనమ్ కపూర్ - పరిణీతి చోప్రాలు కూడా ఇలా ముందు లావుగా ఉండి తర్వాత సన్నగా మారిపోయిన వారే. సైఫ్ కూతురు సారా ఖాన్ ది కూడా ఇదే సమస్య. ఈమె లావు అనే కంటే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అంటే... సింపుల్ గా ఈమె వెయిట్ వంద కేజీల కంటే ఎక్కువే. మరి ఈమెతో సినిమా కరణ్ జోహార్ ఓ సినిమా చేస్తాడంటూ న్యూస్ వచ్చాయి.

ఇంత లావుగా ఉన్న సారాతో సినిమా ఏంటా అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ వాళ్లందరికీ షాక్ ఇస్తూ.. ఇప్పుడు కొత్త లుక్ తో దర్శనమిచ్చింది సైఫ్ కూతురు. తన వెయిట్ ని ఎలా తగ్గించుకుందో కానీ.. సగానికి సగం తగ్గిపోయింది ఈ కుర్ర బ్యూటీ. ఇప్పుడీ సారాఖాన్ ని బాలీవుడ్ జనాలు పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అంటున్నారు. ఇక మరో వారసురాలి తెరంగేట్రానికి బాలీవుడ్ ప్రేక్షకులు సిద్ధమయిపోవాల్సిందే.