Begin typing your search above and press return to search.

ప‌ర్స‌న‌ల్ సెక్యురిటీకి సారా వార్నింగ్

By:  Tupaki Desk   |   30 Nov 2021 10:08 AM IST
ప‌ర్స‌న‌ల్ సెక్యురిటీకి సారా వార్నింగ్
X
సెల‌బ్రిటీల‌కు అభిమానుల నుంచి తాకిడి ప్ర‌తిసారీ ఎదుర‌య్యేదే. కొన్నిసార్లు గుమిగూడి అల్ల‌రి చేసే ప‌రిస్థితి ఉంటుంది. హీరోయిన్లు వేడుక‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఫోటోగ్రాఫ‌ర్లు మీద ఎగ‌బ‌డి మ‌రీ ఫోటోలు తీస్తారు. ఈ సంద‌ర్భంలో అనుకోని సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. కొంత మంది హీరోయిన్లు వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోరు కానీ మరికొంత మంది మాత్రం స‌హ‌నం కోల్పోయి వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ మాత్రం మ‌రోసాని త‌న మృధువైన స్వ‌భావంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సారా అలీఖాన్ న‌టిస్తోన్న `అట్రాంగిరే` త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్బంగా యూనిట్ ప్ర‌మోష‌న్ క‌ర్యాక్ర‌మాలను ప్రారంభించింది.

దీనిలో భాగంగా సినిమాలోని ఓ పాట‌ను ముంబైలోని మిథిబాయి కాలేజ్ ఫెస్ట్ క్షితిజ్ లో లాంచ్ చేయ‌డానికి హాజ‌రైంది. వేడుక అంతా స‌జావుగానే సాగింది. అయితే అక్క‌డ ఫోటో గ్రాఫ‌ర్ ని సెక్యురిటీ గార్డు ప‌క్క‌కు నెట్టారు. అది చూసిన సారా ఎవ‌రిని అలా తొసేస్తున్నార‌ని ప్రశ్నించింది. దానికి ఎవ‌రూ కింద ప‌డ‌లేదని సుక్యురిటీ స‌మాధానం చెప్ప‌గా అందుకు సారా సంతృప్తి చెంద‌లేదు. ఎవ‌రో కింద‌ప‌డ‌టం చూసాను. అలాంటి ప‌నులు చేయ‌కండని అక్క‌డ ఉన్న ఫోటో గ్రాఫ‌ర్లు అంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

మ‌ళ్లి ఇలాంటి త‌ప్పులు చేయ‌కండ‌ని సెక్యురిటీ సిబ్బందికి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చాలాసార్లు విమానాశ్ర‌యాల నుంచి వ‌చ్చేప్పుడు వెళ్లేప్పుడు త‌న‌తో సెక్యూరిటీ కానీ కార్ డ్రైవ‌ర్ కానీ ఉన్నా త‌న ల‌గేజ్ ని తానే మోసుకుంటూ వెళుతూ సారా ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి మృధుత్వం ఇత‌రుల్లో చాలా రేర్ గా మాత్ర‌మే చూడ‌గ‌లం. ఇక ఈ న‌ట‌వార‌సురాలు న‌టించిన `అట్రాంగిరే` చిత్రం డిసెంబ‌ర్ 24న హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. ధ‌నుష్ - అక్ష‌య్ కుమార్ ఇందులో క‌థానాయ‌కులు. ప్ర‌చార చిత్రాల‌కు మంచి హైప్ ద‌క్కింది.