Begin typing your search above and press return to search.

విల్లు ఎక్కుపెట్టి.. ఖడ్గం తిప్పనున్న హీరోయిన్..!

By:  Tupaki Desk   |   26 March 2021 11:30 PM GMT
విల్లు ఎక్కుపెట్టి.. ఖడ్గం తిప్పనున్న హీరోయిన్..!
X
పటౌడీ కుటుంబం నుంచి బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన బ్యూటీ సారా అలీఖాన్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌లు హిందీ చిత్రాల్లో న‌టించి మెప్పించిందీ అమ్మ‌డు. సింబా, కేదార్ నాథ్ వంటి సినిమాల‌తో అల‌రించిన సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు.. గ‌తేడాది ఓటీటీలో రిలీజైన‌ వ‌రుణ్ ధావ‌న్ కూలీ నెం.1 సినిమాలో మెరిసింది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే కనిపించిన ఈ అమ్మ‌డు.. ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్ చేసేందుకు సిద్ధ‌మైంది. ‘యురి’ దర్శకుడు ఆదిత్య ధర్ బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ తో తీయబోతున్న సినిమాలో సారా నటిస్తోందని సమాచారం. ఈ చిత్రానికి ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్తామ’ పేరు పరిశీలనలో ఉంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా సారా అలీఖాన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. మ‌హాభార‌త గాధలో కీల‌కపాత్ర పోషించిన అశ్వ‌త్థామ పేరుతో సినిమా వ‌స్తున్నందున ఇది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడ‌క్ష‌న్లో ఉన్న ఈ చిత్రం అక్టోబ‌ర్ లో సెట్స్ పైకి వెళ్తుంద‌ని స‌మాచారం. కాగా.. ఈ సినిమాలో తాను పోషించే పాత్ర కోసం గుర్ర‌పు స్వారీ, విలు విద్య‌లు కూడా నేర్చుకుంటున్నాడ‌ట హీరో విక్కీ కౌశల్. సారా అలీఖాన్ కూడా ఇదేవిధంగా విల్లు, ఖడ్గాలు చేతపడుతుందా? అనే డిస్కషన్ సాగుతోంది.