Begin typing your search above and press return to search.

అలా కనిపిస్తే క్లిక్కులే!!

By:  Tupaki Desk   |   13 Nov 2017 2:08 PM GMT
అలా కనిపిస్తే క్లిక్కులే!!
X
సైఫ్ అలీ ఖాన్ - అమృతల కుమార్తె సారా ఆలీ ఖాన్ సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతమైన ట్రెండింగ్ లో ఉంటుంది. బాలీవుడ్ అప్ కమింగ్ జనరేషన్ లో ప్రముఖంగా వినిపించే ఈ భామకు.. సోషల్ మీడియాతో పాటు ఆఫ్ స్క్రీన్ లోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. పైగా రాబోయే తరం హీరోయిన్లలో అందరికంటే ముందుగా.. ఫిలిం ఎంట్రీ కన్ఫాం చేసిన సుందరి కావడంతో.. మరింతగా ట్రెండింగ్ అయిపోతూ ఉంటుంది.

సారా ఆలీ ఖాన్ ఎక్కడ కనిపించినా.. ఫోటోగ్రాఫర్స్ కు చేతినిండా పనే. ముఖ్యంగా ఈమె గానీ షార్ట్స్ లో కనిపించిందంటే.. ఇక కెమేరా పర్సన్స్ కు చేతినిండా పనే. చిన్ని చిన్ని దుస్తుల్లో ఈమె అందాలను తమ కెమేరాల్లో బంధించేందుకు తెగ ఉత్సాహం చూపించేస్తున్నారు. తాజాగా ఈమె తన స్నేహితురాలి ఇంటికెళ్లి.. బయటకొస్తుంటే ఫోటోగ్రాఫర్స్ ఇలా క్లిక్ మనిపించేశారు. స్లీవ్ డ్రెస్ లో.. మైక్రో షార్ట్స్ లో అమ్మడి అందాలను కెమేరాల్లో బంధించేశారు. ఇక్కడే కాదు.. సహజంగా ఈమె ఎక్కువగా ఇలాంటి డ్రెస్సుల్లోనే కనిపిస్తోంది. సినిమాల్లో కంటే ముందే.. తన అంద చందాల సత్తాను సోషల్ మీడియాకు ఎక్కేలా చేస్తోంది.

ప్రస్తుతం సారా ఆలీ ఖాన్ ఫిలిం ఎంట్రీ ఖాయం అయింది. ఎంఎస్ ధోనీగా అలరించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన.. కేదార్ నాథ్ మూవీలో హీరోయిన్ గా సినీ అరంగేట్రం చేయనుంది. ఈ మూవీ ప్రిపరేషన్స్ సందర్భంగా బయటకు వస్తున్న ఫోటోలు.. ఇప్పటికే ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేసేస్తున్నాయి.