Begin typing your search above and press return to search.
మాజీ ప్రియుడి గురించి అడిగితే సిగ్గుపడింది!
By: Tupaki Desk | 5 Jun 2022 12:28 PM ISTసైఫ్ అలీఖాన్ నటవారసురాలిగా సారా అలీఖాన్ బాలీవుడ్ లో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కి సోషల్ మీడియాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ భామ ఎఫైర్ వార్తల్లోనూ నిరంతరం హల్ చల్ చేస్తూనే ఉంది. ఇంతకుముందు `లవ్ ఆజ్ కల్` సహనటుడు కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉందని ప్రచారమైంది. కానీ ఆ తరవాత ఆ ఇద్దరూ ఎవరి దారిలో వారు వెళ్లారు.
కానీ ఇప్పుడు పాత ఎఫైర్ ని బాలీవుడ్ మీడియా తవ్వి తీసింది. మరోసారి అదే ప్రశ్నతో సారా వెంటపడింది. IIFA 2022 ఫిలిం అవార్డ్స్ లో కార్తిక్ ఆర్యన్ ని మిస్ అవుతున్నావా? అంటూ ఒక విలేకరి తన వెంటపడ్డాడు. కానీ ఆ ప్రశ్న అడిగినప్పుడు సారా అలీ ఖాన్ వేదిక వైపునకు వెళ్ళిపోయింది. అలాగే తన మాజీ నటించిన `భూల్ భులియా 2` విజయానికి అభినందనలు తెలపింది.
IIFA 2022 ఒక స్టార్రి ఎఫైర్ గా సాగింది. సారా అలీ ఖాన్ ఈ వేదికపై హైలైట్ అయ్యింది. సారా రెడ్ కార్పెట్ పై నిన్న తెల్లటి దుస్తులలో అందంగా కనిపించింది. ఆమె తన సాధారణ చిలిపితనంతో ఫోటోగ్రాఫర్లను పలకరించింది. ఇంతలోనే ఈ వేదికపై కార్తీక్ ఆర్యన్ - కియారా అద్వానీల భూల్ భూలయ్యా 2 విజయం గురించి ఆమెను అడిగారు. ఆ సినిమా టీమ్ విజయానికి తాను సంతోషంగా ఉన్నానని సారా తెలిపింది. ప్రతి సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు సాధించాలని తాను ఎప్పుడూ ఆశిస్తున్నానని సారా అలీ ఖాన్ అన్నారు.
కార్తిక్ ఆర్యన్ ఫేవరెట్ కదా! అని రిపోర్టర్లు అడగ్గానే సారా నవ్వుతూ కనిపించింది. మీరు అతనిని కోల్పోతున్నారా? అని ప్రశ్నించగా..సారా ఇంకేదీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంత తెలివితక్కువ ప్రశ్న అడిగినందుకు కొందరు రిపోర్టర్ పై విరుచుకుపడ్డారు. కార్తిక్ ఆర్యన్ కోవిడ్-19 పాజిటివ్ తో చికిత్సను పొందుతున్నారు. అతడు IIFA 2022 నుండి తప్పుకోవాల్సి వచ్చింది. భూల్ భూలయ్యా 2 ప్రమోషన్ల సందర్భంగా ఇతర అన్ని ప్రమోషన్లకు కాదని చెప్పాడు. కియరా అద్వాణీతో అతడు ఫుల్ గా ప్రచారంలో పాల్గొన్నాడు. భూల్ భులయా 2 బ్లాక్ బస్టర్ సాధించి 200 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోంది.
సారా అలీ ఖాన్ తో కార్తీక్ ఆర్యన్ ఎఫైర్ గురించి ఇప్పుడు అవార్డుల వేళ మరోసారి చర్చ సాగుతోంది. లవ్ ఆజ్ కల్ 2లో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ జంటపై పుకార్లు వచ్చాయి. ఆమె పుట్టినరోజు కోసం కార్తీక్ ఆర్యన్ విదేశాలకు కూడా వెళ్లాడు. కానీ ఆ తర్వాత అంతా మారింది. ఎవరికి వారు రకరకాల షెడ్యూళ్లతో దూరమయ్యారు. సమయ సమస్యలు ఇతర అంశాలు బ్రేకప్ కు దారితీశాయి. ఈ సంబంధం 2019 ఆరంభంలో ప్రారంభమై దాదాపు పది నెలల వ్యవధిలో ముగిసింది.

సారా అలీ ఖాన్ తన తల్లి అమృతా సింగ్ కెరీర్ ప్రారంభ దశలో కెరీర్ పై ఎలా దృష్టి పెట్టాలని కోరుకుందో వెల్లడించగా బ్రేకప్ అంటూ ప్రచారం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత జాన్వీ కపూర్ తో కార్తీక్ ఆర్యన్ కి ముడిపెడుతూ ఎఫైర్ కథనాలు వెలువడడం విశేషం. కానీ దీనికి ఆధారాలేవీ లేవు. అన్నట్టు భూల్ భులయా 2 విజయంపై ఆనందం వ్యక్తం చేసిన సారాకు కార్తీక్ ఎందుకని రికమండ్ చేయలేదు. బ్లాక్ బస్టర్ ఆఫర్ సారా ఎందుకు మిస్సయినట్టు? అంటూ ఇప్పుడు వాడి వేడిగా చర్చ నడుస్తోంది. ప్రియుడితో బ్లాక్ బస్టర్ మిస్ చేసుకుంది! అంటూ అభిమానులు కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.