Begin typing your search above and press return to search.
బుల్లి తమ్ముడితో సైఫ్ డాటర్ సారా మొదటి ఫోటో
By: Tupaki Desk | 17 Aug 2021 11:00 PM ISTనటవారసురాలు సారా అలీ ఖాన్ తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ 51 వ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒక ఎమోషనల్ నోట్ రాసిన సారా తన తండ్రిని `చక్కని ప్రయాణ స్నేహితుడు` అంటూ పొగిడేసింది.
సైఫ్ పుట్టినరోజు వేడుకల నుండి ఒక అందమైన ఫోటోని సారా పోస్ట్ చేసింది. అక్కడ ఆమె సైఫ్ - కరీనా- చిన్న సోదరుడు జెహ్ అలీ ఖాన్ తో కలిసి సరదాగా గడిపారు. ఇది చిన్న తమ్ముడు జెహ్ తో సారా మొదటి ఫోటో.. కరీనా అతడిని పట్టుకుని ఉండగా సారా క్యూట్ కిడ్ ని ముద్దాడేందుకు ప్రయత్నించింది. `సూపర్ హీరో అబ్బా` కోసం ఒక తీయనైన పుట్టినరోజు సందేశాన్ని కూడా సారా రాసింది. ``హ్యాపీయెస్ట్ బర్త్‌డే అబ్బా... నా సూపర్ హీరో.. నా తెలివైన స్నేహితుడు.. ఉత్తమ సంభాషణకర్త,.. చక్కని ట్రావెల్ బడ్డీ... అతిపెద్ద సపోర్టింగ్ సిస్టమ్ లలో ఒకరు... లవ్ యు...`` అంటూ ఎమోషనల్ అయ్యింది సారా. రెండవ ఫోటోలో సారా చేతిలో చాక్లెట్ కేక్ పట్టుకుని కనిపించింది.
అంతకుముందే సైఫ్ అలీ ఖాన్ కూడా కరీనా నుండి హృదయపూర్వక సందేశాన్ని అందుకున్నాడు. కరీనా మాల్దీవులలో కొనసాగుతున్న సెలవుల నుండి కొన్ని చిత్రాలను పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. సోదరి సోహా అలీ ఖాన్ కూడా తన సోదరుడు సైఫ్ కి ఇన్ స్టాగ్రామ్ లో శుభాకాంక్షలు తెలుపుతూ పటౌడీ రాజ వస్త్రధారణతో ఉన్న సొగసైన చిత్రాలను పంచుకున్నారు. ``పుట్టినరోజు శుభాకాంక్షలు భాయ్! నాగరికత కోసం మరిన్ని ప్రయత్నాలు చేయండి.. సమయానికి రాత్రి భోజనం చేయడం.. మరువొద్దు .. అని సోహా అందమైన చిత్రాలకు క్యాప్షన్ ఇచ్చింది.
సారా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. హర్రర్-కామెడీ భూత్ పోలీస్ లో నటిస్తోంది. అట్రాంగిరే అనే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో నూ సారా నాయిక. బంటీ ఔర్ బాబ్లి 2 చిత్రీకరణలో ఉంది.