Begin typing your search above and press return to search.

సారా బికినీ ఫోటో ఎవరు తీయించారు?

By:  Tupaki Desk   |   17 May 2017 12:01 PM GMT


సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఆన్ లైన్ సెన్సేషన్. ఇప్పటికే ఈ భామకు బోలెడంత ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరో వారసురాలు కావడంతో.. సెలబ్రిటీ స్టేటస్ కూడా ఉంది. మరోవైపు.. త్వరలోనే సినీ అరంగేట్రం చేయనుందన్న వార్తలు ఉండడంతో.. ఈమెపై జనాల ఆరా కూడా ఎక్కువే.

తాజాగా సారా అలీ ఖాన్ కు చెందిన ఓ బికినీ పిక్ వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది. అప్ కమింగ్ భామలు అందాలు చిందిస్తూ కనిపించడం కొత్తమే కాదు కానీ.. ఇలా ఈ భామ ఫోటో నెట్ లో కనిపించిన కొన్ని గంటలకే మాయం కావడంతోనే ఇంకా పెద్ద విషయం అయింది. టీవీ ప్రొడ్యూసర్ వికాస్ గుప్త షేర్ చేసిన ఓ ఫోటోలో.. సారా అలీ ఖాన్ బికినీలో కనిపించింది. ఇద్దరూ కలిసి ఫోటో దిగగా.. పాత ఫ్రెండ్ తో కలిసి ఫోటో దిగా అంటూ చెప్పుకొచ్చాడు వికాస్ గుప్తా. ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో ఈ ఫోటో దిగగా.. ఈ ఫోటోను ఆ ప్రొడ్యూసర్ డిలెట్ చేసేశాడు.

త్వరలో సినీ అరంగేట్రం చేస్తున్న సమయంలో.. ఇలాంటి ఫోటోలు నెట్ లో చక్కర్లు కొట్టడం అంత సమంజసం కాదని భావించి.. సైఫ్ అలీ ఖాన్ స్వయంగా వికాస్ గుప్తతో మాట్లాడి మరీ ఈ ఫోటోను సోషల్ మీడియాలోంచి డిలెట్ చేయించాడనే టాక్ బాలీవుడ్ లో నడుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/