Begin typing your search above and press return to search.

తండ్రి చేతిలో నాడు కూతురు-నేడు హీరోయిన్!

By:  Tupaki Desk   |   20 May 2020 10:50 AM GMT
తండ్రి చేతిలో నాడు కూతురు-నేడు హీరోయిన్!
X
బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృతల గారాలపట్టి సారా అలీఖాన్. పటౌడీ నవాబ్ అయిన సైఫ్ కుమార్తె కావడంతో సారాను బాలీవుడ్‌ ఇండస్ట్రీలో యువరాణి స్థాయిలో ట్రీట్ చేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం సైఫ్ అమృత విడిపోవడంతో పిల్లలు సైఫ్ వద్దే ఉంటున్నారు. అప్పుడప్పుడూ తన తల్లిని కలవడానికి వెళ్తుంటారు. 2018లో విడుదలైన సారా ‘కేదార్‌నాథ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా నటించిన ‘సింబా’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత సారాకు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ ఏడాది తన తండ్రి సైఫ్ నటించిన ‘లవ్ ఆజ్ కల్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'లవ్ ఆజ్ కల్' సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంది. సారా కొంటె చూపులకు యువత మనసు పారేసుకుంటున్నారు. చేసింది మూడు సినిమాలే అయినా సారాకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సారాకి ఇన్‌స్టాగ్రామ్ లో 13 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. సారా చిన్నప్పుడు తన తండ్రి భుజాలపై ఎక్కి ఫోటోలు దిగింది. ఆ ఫోటోతో తను తాజాగా దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో ఫాదర్ డాటర్ గోల్స్ అనే ట్యాగ్ లైన్ తో షేర్ చేసింది. చిన్నప్పుడు సారా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని కాస్ట్యూమ్స్ లుక్స్ తో.. క్యూట్ గా ఉంది. ఇక తాజా ఫోటోలో తండ్రి పక్కన హీరోయిన్ గా పోజిచ్చి నిలబడింది. అమ్మడిని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! అలా తన చిన్ననాటి జ్ఞాపకాలు షేర్ చేస్తుంది. ఇక ప్రస్తుతం సారా చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వరుణ్ ధావన్‌కు జోడీగా ‘కూలీ నెం 1’ సినిమా, అలాగే ధనుష్ తో మరో సినిమా వరుసలో ఉన్నాయి. సారా సినిమాలే కాదు ఎన్నో కమర్షియల్ యాడ్స్‌లోనూ మెరుస్తుంది. గార్నియర్, ఫాంటా, వివో తదితర బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం సారా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తను ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి సంస్థలు ముందుకొస్తున్నాయి. మొత్తానికి సారాలో టాప్ హీరోయిన్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయని సినీవర్గాలు చెప్తున్నాయి.