Begin typing your search above and press return to search.

జిమ్ ఎగ్గొట్టేందుకు `పీరియ‌డ్` సాకు కాద‌న్న సారా

By:  Tupaki Desk   |   15 Dec 2021 7:00 AM IST
జిమ్ ఎగ్గొట్టేందుకు `పీరియ‌డ్` సాకు కాద‌న్న సారా
X
క్ర‌మం త‌ప్ప‌కుండా జిమ్ చేయాలంటే కావాల్సింది కుంటె సాకులు చెప్ప‌డం కాదు.. నిబ‌ద్ధ‌త ప‌ట్టుద‌ల చాలా అవ‌స‌రం. కొంద‌రు ర‌క‌ర‌కాల సాకులు చెప్పి ఎగ్గొడుతుంటారు. కానీ స్టార్ డాట‌ర్ సారా అలీఖాన్ అందుకు మిన‌హాయింపు. ఈ బ్యూటీ దాదాపు 120 కేజీల బ‌రువు నుంచి 60 కేజీల బ‌రువు కు త‌గ్గేందుకు త‌న లైఫ్ స్పాన్ లో ఎంతో గొప్ప సాహ‌స‌మే చేసింది. ఇప్పుడు ఆ ఫ్యాట్ ఉమెన్ కుర్ర‌కారు క‌ల‌ల రాణిగా మారింది. ఇదంతా త‌న హార్డ్ వ‌ర్క్ డెడికేష‌న్ ప‌ట్టుద‌ల‌తోనే సాధ్యమైంది.

సారా నేటిత‌రంలో ప్రామిస్సింగ్ హీరోయిన్ గా ఎదిగేసింది. వ‌రుస చిత్రాల‌తో బాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఇక ఫిట్ నెస్ గురించి జిమ్ చేయ‌డం గురించి సారా తాజా చాటింగ్ లో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. ముఖ్యంగా జిమ్ ఎగ్గొట్టేవారికి అదిరే పంచ్ ఇచ్చింది ఈ బ్యూటీ. సారా అలీ ఖాన్ జిమ్‌ను దాటవేయడానికి ‘పీరియడ్’ అనేది ఒక సాకు కాదు అని అంది.

తన అసాధార‌ణ‌ బరువును తగ్గించే ప్రయాణంతో చాలా మందికి స్ఫూర్తినిచ్చిన సారా అలీ ఖాన్ తన హార్డ్ వర్క్ తో ఇతరులను ప్రేరేపించడానికి ఉన్న ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌దు. సారా తన నెలవారీ పీరియడ్ ల స‌మ‌యంలో కొన్ని ప్రధాన ఫిట్ నెస్ ప్రేరణల‌ను తెలియ‌జేసింది. స్ఫూర్తి నింపేందుకు తానే జిమ్ కి వెళ్లింది. ఆమె ఒక వీడియోను షేర్ చేసింది. పీరియ‌డ్ స‌మ‌యంలో ఆమె వర్కౌట్ సెషన్ ఎలా ఉందో తన అభిమానులకు అంతర్దృష్టిని ఇచ్చింది. సారా దానికి ఓ కవితతో క్యాప్షన్ కూడా ఇచ్చింది.

``నేను మేల్కొన్నాను .. నేను జిమ్ కి రాలేను.. ఎందుకంటే నేను అలసిపోయాను.. సోమరితనంతో ఉన్నాను.. ఎక్కువ ప్రేరణ పొందలేదు.. ఉబ్బరంతో ఉన్నాను.. ఎందుకంటే నాకు రుతుస్రావం వచ్చింది`` అని ఆమె చెప్పింది. ఇంకా తనకు తాను బ‌ల‌వంతంగా నెట్టుకుంటూ జిమ్ కి రావాల్సి వచ్చిందని చెప్పింది. నేను మానసికంగా.. శారీరకంగా.. హార్మోన్లపరంగా అన్ని విధాలుగా నా గురించి మెరుగ్గా అనుభూతి చెందడానికి నేను వ్యాయామాలు చేయడానికి వచ్చాను. నేను గర్విస్తున్నాను.. అని వెల్ల‌డించింది. పైలేట్స్ స‌హా ప‌లు తేలిక‌పాటి వ్యాయామాల్ని చేస్తున్న వీడియోల‌ను షేర్ చేసింది. సారా తాను అరవై నిమిషాల పాటు వర్కవుట్ చేస్తున్నానని తెలుసుకున్న తర్వాత `1 గంట ఏమీ లేదు!` అని చెప్పింది. ఇలాంటి ప్ర‌త్యేక వ్యాయామాల‌తో పీరియ‌డ్ ని ఖాత‌రు చేయాల్సిన ప‌ని లేదని సారా చెప్ప‌క‌నే చెప్పింది. ప్ర‌తిదానికి ఆల్ట‌ర్నేట్ అనేది ఉంటుంద‌ని కూడా అర్థ‌మ‌య్యేలా వివ‌రించింది.