Begin typing your search above and press return to search.

ఆ హీరో కూతురు.. అంతా రూమరే

By:  Tupaki Desk   |   11 Nov 2016 9:30 AM GMT
ఆ హీరో కూతురు.. అంతా రూమరే
X
సైఫ్ అలీ ఖాన్- అమృతా సింగ్ ల కూతురుగా.. కాబోయే హీరోయిన్ గా సారా అలీ ఖాన్ కు బోలెడంత ఇమేజ్ ఉంది. సోషల్ మీడియాలో హాట్ బ్యూటీగా అంతకు మించిన ఫాలోయింగ్ ఉంది. ఈ భామ బాలీవుడ్ అరంగేట్రంపై చాలారోజుల నుంచే అంచనాలు ఉన్నాయ్ కానీ.. రీసెంట్ గా రణవీర్ తో ఓ మూవీ ఖాయమైందంటూ వార్తలు వచ్చాయి.

జోయా అక్తర్ మూవీలో రణవీర్ కి జోడీగా సారా నటిస్తోందన్న వార్తల్లో వాస్తవం లేదని అంటున్నారు సన్నిహితులు. 'జోయా మూవీపై ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఈ సినిమాలో సారా అరంగేట్రం చేయనుందనే వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏమీ చెప్పలేం. జోయా సోదరుడు ఫరాన్ కు సైఫ్ కు మంచి ఫ్రెండ్. ఒక వేళ ఈ మూవీలో సారాతో నటింపచేయాలంటే.. ఆ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కానీ.. అమృతా సింగ్ కానీ చేయాలనే కండిషన్ కచ్చితంగా ఉంటుంది' అంటున్నారట సన్నిహితులు. అంటే కూతురుని హీరోయిన్ గా తీసుకోవాలంటే.. ఆ సినిమాలో అమ్మానాన్నల్లో ఒకరికి ఓ మాంచి రోల్ ఉండాలన్న మాట. అలా అయితే.. సారాని కనిపెట్టుకుని ఉండే అవకాశం ఉంటుందన్నది ఈ పేరెంట్స్ యోచన. బాలీవుడ్ లో ఈ తరహా కండిషన్ పెట్టిన మొదటి స్టార్ కపుల్ వీళ్లే అనుకుంటా.

మొన్నామధ్యన కరీనా కపుర్ బర్త్ డే పార్టీలో నాభి అందాలతో విందు చేసిన సారా ఖాన్.. అయితే అప్పుడే తెరంగేట్రం చేయట్లేదనమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/