Begin typing your search above and press return to search.

తండ్రి వయసున్న స్టార్‌ తో రొమాన్స్ కుమ్మేసిందట!

By:  Tupaki Desk   |   19 Dec 2021 4:41 AM GMT
తండ్రి వయసున్న స్టార్‌ తో రొమాన్స్ కుమ్మేసిందట!
X
హీరోలు అయిదు పదుల వయసులో ఆరు పదుల వయసులో కూడా పాతికేళ్ల అమ్మాయిలతో రొమాన్స్ చేయడం ఈమద్య కాలంలో సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. ఇది ఎక్కువగా సౌత్‌ లో కనిపిస్తూ ఉంది. సౌత్‌ లో పలువురు ఆరు పదుల వయసు హీరోలు ఉన్నారు. వారు నిండా పాతికేళ్లు లేని అమ్మాయిలతో అంటే తన కూతురు వయసు కంటే చిన్న వయసు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నారు. జనాలు ఆ రొమాన్స్ ను స్వాగతిస్తున్నారు. కొందరి విషయంలో విమర్శలు వచ్చినా సినిమాను సినిమాగా చూడాలనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు ఓకే అన్నట్లుగా సినిమాలను చూస్తున్నారు. ఇదే పద్దతి ఇప్పుడు బాలీవుడ్‌ లో కూడా కనిపించబోతుంది. హాట్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్‌ సీనియర్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్ తో అత్రంగి రే సినిమా లో రొమాన్స్ చేసిన సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయని బాలీవుడ్ మీడియా వర్గాల వారు అంటున్నారు. తాజాగా సినిమా నుండి వచ్చిన పాటలు మరియు ఇతర ప్రమోషనల్ వీడియోలను చూస్తుంటే ఇద్దరి మద్య రొమాంటిక్ సన్నివేశాలు ఆహా అన్నట్లుగా ఉండబోతున్నాయి అనిపిస్తుంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్ అలీ ఖాన్‌ కూతురు అయిన సారా అలీ ఖాన్ ఇప్పటి వరకు యంగ్ స్టార్‌ లతో.. కొత్త హీరోలతో మాత్రమే నటించింది. స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకోవాలంటే సూపర్‌ స్టార్స్ తో నటించాల్సిందే. అందుకే అక్షయ్‌ కుమార్‌ వంటి సీనియర్ స్టార్‌ హీరో.. అది కూడా తన తండ్రి వయసు సమానుడు అయిన అక్షయ్‌ కుమార్ తో కెమిస్ట్రీకి ఓకే చెప్పిందట. భారీ అంచనాల నడుమ రూపొందిన అత్రంగి రే సినిమా లో ఈమె ఛాలెంజింగ్‌ గా తీసుకుని నటించిందట. ఈ సినిమాలో మరో హీరోగా ధనుష్‌ నటించాడు. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి బాలీవుడ్‌ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

అత్రంగి రే సినిమా లో హీరోయిన్ సారా అలీ ఖాన్ మొదట ధనుష్ ను వివాహం చేసుకుంటుంది. భర్త పై ఆసక్తి లేని ఆమె అక్షయ్ కుమార్‌ అంటే ఆసక్తి చూపిస్తూ వస్తుంది. అక్షయ్‌ కుమార్‌ తనకు వయసులో పెద్ద వాడు అయినా అతడితో కెమిస్ట్రీని కోరుకుంటుంది. అలా అలా సాగే కథ చివరకు ఎక్కడి వరకు వెళ్లింది... సీనియర్ స్టార్‌ అక్షయ్‌ కుమార్ తో సారా అలీ ఖాన్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సినిమాలో చూపించినట్లుగా చెబుతున్నారు. తండ్రి వయసు ఉన్న వ్యక్తితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలంటే ఏ హీరోయిన్ కు అయినా కాస్త ఇబ్బంది అనడంలో సందేహం లేదు. అయితే నటన అంటే ఫ్యాషన్‌.. ఇష్టంతో ఆ ఇబ్బందిని సారా అలీ ఖాన్‌ పక్కకు నెట్టిందని అత్రంగి సినిమా మేకర్స్ అంటున్నారు.