Begin typing your search above and press return to search.
సారాకి మానసిక రుగ్మత ఎంత పని చేసిందంటే?
By: Tupaki Desk | 4 Nov 2021 7:00 PM ISTబాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ నటిగా కొనసాగుతోంది. సైఫ్ అలీఖాన్- అమృతాసింగ్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సారాకి అవకాశాల పరంగా కొదవ లేదు. తల్లిదండ్రుల బ్రాండ్ ఇమేజ్ తో మార్కెట్ లో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సారా తల్లిదండ్రుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తండ్రి సైఫ్ అలీఖాన్ అసభ్యంగా మాట్లాడే బూతుల తండ్రి అనుకుందిట. అలాగే తల్లి అమృతా సింగ్ ఓ ఫోర్న్ వెబ్ సైట్ ఓనర్గా చెలామణి అయ్యేదని..దాంతో ఇద్దరిపై చిన్న తనంలోనే నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడిందని సారా తెలిపింది.
మరి సారా ఇంతగా రియాక్ట్ అయ్యేటప్పుడు తన వయసెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సారాకి సరిగ్గా తొమ్మిదేళ్ల వయసులో తల్లిదండ్రుల పట్ల ఇలా పీలైందిట. అప్పట్లో సైఫ్ `ఓంకారా` అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అందులో సైప్ నెగిటివ్ రోల్ పోషించాడు. అందులో అతని పాత్ర అసభ్యంగా ఉంటుంది. ఇక `యుగ్` అనే సినిమాలో అమృతాసింగ్ ఓ పోర్న్ సైట్ ఓనర్ పాత్రలో నటించింది. విదేశాల్లో ఉంటూ ఇలాంటి చెడ్డ పనులు చేసే పాత్ర ఆమెది. అనేక మంది అమ్మాయిల జీవితాల్ని బలి చేసే రోల్ ఆమెది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి సారా వయసు తొమ్మిదేళ్లు అట.
అప్పుడే రెండు సినిమాలు చూడటంతో బయట కూడా అలాగే ఉంటారేమోనన్న భ్రమలో కొన్నాళ్ల పాటు ఉండేదాన్ని అని తెలిపింది. తనలో ఆ భావన చాలాకాలం పాటు తొలగిపోలేదని..తర్వాతి కాలంలో తనకు అది ఓ మానసిక సమస్యల తయారైందని తెలిపింది. ఆ తర్వాత అది సినిమా అని వాస్తవాలు తెలుసుకున్నట్లు సారా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక సైఫ్ అలీఖాన్-అమృతాసింగ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైఫ్- నటి కరీనా కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి విధితమే.