Begin typing your search above and press return to search.

సుకుమారీ అట్ట సంప‌మాకే!

By:  Tupaki Desk   |   22 Aug 2018 4:30 PM GMT
సుకుమారీ అట్ట సంప‌మాకే!
X
సారా అలీఖాన్ .. ఇటీవ‌లి కాలంలో అటు బాలీవుడ్ స‌హా సౌత్ ఇండ‌స్ట్రీస్‌ లోనూ మార్మోగిపోతున్న పేరు ఇది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా తెరంగేట్రం చేస్తోంది అన‌గానే - ఇటువైపు సౌత్ నుంచి కాల్స్ వెళ్లాయ‌ని ప్ర‌చార‌మైంది. ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ - ప్ర‌భాస్ లాంటి హీరోలు సారాని టాలీవుడ్‌ కి ర‌ప్పించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తామ‌ర‌తంప‌ర‌గా వార్త‌లొచ్చాయి. కానీ అందులో వాస్త‌వ‌మెంతో తెలీదు కానీ - సారా మాత్రం బాలీవుడ్ ఎంట్రీపైనే ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది.

అప్ప‌ట్లో క‌ర‌ణ్ జోహార్ సార‌థ్యంలోని కేధార్‌ నాథ్ చిత్రంలో న‌టించినా ఆ సినిమా కొన్ని అవాంత‌రాల వ‌ల్ల మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. దాంతో సింబా చిత్రంలో న‌టిస్తోంది. సారాకి ఇదే తొలి సినిమా అవుతుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఏదేమైనా సారా మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతూ కాన్ఫిడెంట్‌ గా ఉంది.

సారా ఎక్క‌డికి వెళ్లినా అక్క‌డ ఫాలోయింగ్ మామూలుగా ఉండ‌డం లేదు. ఇప్ప‌టికే అటు నార్త్‌ - ఇటు సౌత్‌లో ఈ అమ్మ‌డికి వీరాభిమానులేర్ప‌డ్డారు. ఇదిగో ఇక్క‌డ వైట్ డ్రెస్‌ లో సంపెంగ పువ్వులా క‌నిపిస్తోంది. అట్ట సూడ‌కే.. న‌న్న‌ట్ట సంప‌మాకే! అంటూ యూత్ సాంగేసుకునే లెవ‌ల్లో ఉంది వ్య‌వ‌హారం. సారా జిమ్ముకెళ్లినా - ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్‌ లో అయినా త‌న‌వైన అంద‌చందాల‌తో సంపేస్తోంది. క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని న‌వ‌య‌వ్వ‌న సౌంద‌ర్యం సారా సొంతం. అట్ట సూత్తే... సుకుమారంగా.. గారంగా..! త‌న మేని విరుపులో మ‌ల్లెపువ్వు గుభాళింపు.. సంపెంగ సుగంధం జాలువారుతోంది క‌దూ?