Begin typing your search above and press return to search.

మరో స్టార్ డాటర్ అరంగేంట్రం..

By:  Tupaki Desk   |   13 Dec 2016 10:30 PM GMT
మరో స్టార్ డాటర్ అరంగేంట్రం..
X
స్టార్ హీరోలు.. హీరోయిన్ల వారసులు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలామంది ఇలాంటి వారసులైన హీరోలు.. హీరోయిన్లు తెగ వెలిగిపోతున్నారు. మరో మరో స్టార్ డాటర్ కూడా రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది.

సైఫ్ అలీ ఖాన్.. అమృతా సింగ్ ల కుమార్తె సారా ఆలీఖాన్ వయసు ఇఫ్పుడు 24 ఏళ్లు. టీనేజ్ లోనే చాలామంది భామలు హీరోయిన్లుగా అరంగేట్రం చేసేస్తున్నారు. కానీ ఈ భామ కాస్త లేటుగా అయినా ఎంట్రీ ఫిక్స్ చేసేసుకుంది. గతంలో రణవీర్ సింగ్ తో ఈ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని అన్నారు కానీ.. ఇప్పుడు కొత్త విషయం తెలియవచ్చింది. కరణ్ మల్హోత్రా డైరెక్షన్ లో హృతిక్ రోషన్ కి జోడీగా.. బాలీవుడ్ లో ప్రవేశించనుందింట సారా. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా.. సైఫ్ కూతురు హీరోయిన్ ఎంట్రీ ఖాయమైపోయినట్లే.

ఇప్పటికే సోషల్ మీడియాలో సారా అలీ ఖాన్ కి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. హాట్ ఫోటోలతో నానా రచ్చ చేయడంలో ఈమెకు మాంచి గుర్తింపు కూడా ఉంది. ఇప్పుడు హీరోయిన్ గా తెరంగేట్రం ఖాయం కావడంతో.. ఈ హంగామా ఇంకా పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. నిజానికి సారా అలీ ఖాన్ ను కరణ్ జోహార్ ఇంట్రడ్యూస్ చేద్దామని భావించాడు కానీ.. కరణ్-అమృతల మధ్య ఉన్న విబేధాల కారణంగానే ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/