Begin typing your search above and press return to search.

లేత వయ్యారాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న కుర్రభామ!!

By:  Tupaki Desk   |   17 Jan 2021 6:00 AM IST
లేత వయ్యారాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న కుర్రభామ!!
X
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్.. గురించి గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రోజురోజుకి అమ్మడు బాలీవుడ్ రెగ్యులర్ స్టార్ హీరోయిన్లకు పోటీగా తయారవుతుందని అర్ధమవుతుంది. సైఫ్ అలీఖాన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సారా.. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అటు గ్లామర్ పరంగా ఇటు యాక్టింగ్ పరంగా రెండిట్లోను తన మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తోంది.

'కేదార్‌నాథ్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సారా ఇప్పుడు యువతకు డ్రీమ్ గర్ల్ గా పాపులారిటీ సాధించింది. ఫస్ట్ సినిమా ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా నటించిన 'సింబా' సినిమా మాత్రం అమ్మడికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందించింది.

ఇక సింబాతో సారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అదే ఊపులో గతేడాది కార్తీక్ ఆర్యన్ సరసన 'లవ్ ఆజ్ కల్' సినిమా చేసింది. ఆ సినిమాలో అమ్మడి నటనకు విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది కానీ సినిమా మాత్రం హిట్ సక్సెస్ కాలేదు. ఇక రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'కూలీ నెం1' సినిమా విడుదలైంది. ఈ సినిమాలో యంగ్ హీరో వరుణ్ ధావన్ సరసన ఆడిపాడింది సారా. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది.

కానీ గ్లామర్ పరంగా హీరోయిన్ కి మంచి మార్కులు పడ్డాయి. అమ్మడి గ్లామర్ షో, డాన్స్ ఆదరగొట్టిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం సారా, ధనుష్ సరసన 'ఆత్రంగిరే' సినిమా చేస్తోంది. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇదిలా ఉండగా సారా సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ కలిగి ఉంది. అయితే తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ లో అమ్మడు బ్రైట్ లైట్ లా వెలిగిపోతుంది. కేవలం ఒకే సూట్ తో అమ్మడు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.