Begin typing your search above and press return to search.

బీచ్ ఇసుక‌లో మండే ఎండ‌లో ఏంటిది పిల్లా?

By:  Tupaki Desk   |   3 April 2022 9:00 PM IST
బీచ్ ఇసుక‌లో మండే ఎండ‌లో ఏంటిది పిల్లా?
X
న‌ట‌వార‌సుల వెల్లువ‌లో జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్న భామ‌గా సైఫ్ ఖాన్ వార‌సురాలు సారా అలీ ఖాన్ కి పేరుంది. ఈ భామ అణ‌కువ‌తో పాటు ప్ర‌తిభ ప్ర‌తిసారీ చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. అందానికి అందం క‌వ్వింత తెలిసిన న‌ట‌వార‌సురాలు అంటూ కితాబు అందుకుంటోంది. సారా వ‌రుస ఫోటోషూట్లు వెబ్ ని మంట పెడుతున్నాయి. హాట్ బ్యూటీ పెప్పీ వైబ్స్ అన్ లిమిటెడ్ గ్లామ‌ర్ ట్రీట్ గురించి ప్రస్తావించకుండా ఉండలేం. తాజాగా సారా ఇన్ స్టాగ్రామ్ లో బీచ్ విహారయాత్ర నుండి ఫోటోలను విడుద‌ల చేసి యూత్ ని విస్మయానికి గురిచేసింది.

ఆ ఫోటోల్లో ఆమె కలర్ ఫుల్ బికినీలో కనిపించింది. సారా అన్నివేళ‌లా ఎంతో ప్లెజెంట్ గా చిరునవ్వులు చిందిస్తూ ఎంతో సరదాగా ఉంటుంది. త‌నకు బీచ్ అంటే చాలా ఇష్టం. బీచ్ ఇసుక తిన్నెల్లో ఎండ వాతావరణాన్ని ప్రేమిస్తుంది. ఆమె శీర్షిక చదివిన తర్వాత అది అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. తాజా ఫోటోషూట్ ని షేర్ చేసి సారా ఇలా వ్యాఖ్యానించింది. ``సూర్యుడు సముద్రం మరియు ఇసుక`` అంటూ సింపుల్ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఫోటోలను వీక్షించాక‌ అభిమానులు మురిసిపోతున్నారు.

నటి రాధిక మదన్ `గార్జియస్` అని వ్యాఖ్యానించి రెడ్ హార్ట్ ఎమోజీని జోడించారు. సారా అలీ ఖాన్ కు బీచ్‌లు అంటే పిచ్చి. ట్రెడిష‌న్ అన్నా ఇష్టం. ఆమె తరచుగా దేవాలయాలను సందర్శిస్తుంది. అది తన స్నేహితులు.. కుటుంబం లేదా సహోద్యోగులతో కుదిరిన‌ప్పుడ‌ల్లా.. ఇటీవల ఆమె గుజరాత్ లోని నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించిన ఫోటోలను పంచుకుంది.

కానీ త‌ను ఒంటరిగా వెళ్ల‌లేదు. ఆమె ఫోటోలలో గ్యాస్ లైట్ సహనటుడు విక్రాంత్ మాస్సే ఉన్నారు. ప్రారంభ స్లైడ్ లో సారా -విక్రాంత్ శివలింగం పక్కన కూర్చుని క‌నిపించారు. రెండవ ఫోటోలో సారా సోలోగా క‌నిపించింది. చివరి ఫ్రేమ్ లో సారా .. విక్రాంత్ సూర్యాస్తమయం వీక్షణను ఆస్వాధిస్తూ కనిపించారు.

సారా అలీ ఖాన్ హాబీస్ చాలా ఆస‌క్తిక‌రం. త‌న‌కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె కొన్ని రోజుల క్రితం లడఖ్ లో ఉంది. నిజమైన యాత్రికురాలిగా ఈ ప్రదేశం అందించే సుందరమైన అందాలను చూసిన తర్వాత ఆమె ఆత్మపరిశీలన చేసుకునే మూడ్ లోకి వెళ్లిపోయింది. సారా తన ఆలోచనలను పంచుకుంటూ పర్యటన నుండి కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది.

ఆమె 20వ శతాబ్దపు ఇటాలియన్ నటి ఎలియోనోరా డ్యూస్ నుండి కోట్ ను కూడా షేర్ చేసింది.``నీలాకాశాన్ని చూడటం మిమ్మల్ని ఆనందంతో నింపినట్లయితే.. పొలాల్లో ఒక గడ్డి మొలకెత్తినట్లయితే.. సాధారణ విషయాలు మిమ్మల్ని కదిలించే శక్తిని కలిగి ఉంటాయి. మీ ఆత్మ సజీవంగా ఉన్నందున మీరు అర్థం చేసుకునే సందేశాన్ని ప్రకృతికి కలిగి ఉంది.. సంతోషించండి`` అన్న వ్యాఖ్యానం జోడించింది. సారా అలీ ఖాన్ ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు ఎల్లప్పుడూ ఆమె విహార‌యాత్ర‌ల‌ను వెల్ల‌డిస్తుంటాయి.