Begin typing your search above and press return to search.

బికినీలో టోన్డ్ బాడీ యాబ్స్ చూపిస్తూ పిచ్చెక్కించిన సారా

By:  Tupaki Desk   |   13 Nov 2021 10:35 PM IST
బికినీలో టోన్డ్ బాడీ యాబ్స్ చూపిస్తూ పిచ్చెక్కించిన సారా
X
ఫ్యాషన్ గోల్స్ లెవ‌ల్ ని పెంచడంతో పాటు సీరియస్ ట్రావెల్ గోల్ ని సెట్ చేస్తోంది బాలీవుడ్ హాటీ సారా అలీఖాన్. ఈ బ్యూటీ కి మాల్దీవులు కొత్త కాదు కానీ.. ఈసారి ట్రిప్ సంథింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి. ఈ శనివారం మాల్దీవుల్లో కార్టూన్ ప్రింట్ బికినీలో అగ్గి రాజేసే లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది సారా. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

తాజాగా ఇన్ స్టా వేదిక‌గా సారా అనేక ఫోటోలు వీడియోల‌ను షేర్ చేయ‌గా మంట‌లు పెడుతున్నాయి. మాల్దీవుల్లో త‌న‌ స్నేహితులతో  విహారయాత్రను ఆస్వాధిస్తూ విశ్రాంతి తీసుకుంటోంది ఈ బ్యూటీ. సారా బహుళ వర్ణాలలో కార్టూన్ స్కెచ్ ల‌తో రూపొందించిన‌ బ్లూ బేస్ బికినీ ని ధరించింది. కిల్లర్ వాష్ బోర్డ్ ఆబ్స్ ను ప్రదర్శిస్తూ సారా కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చింది. సారా తన సిగ్నేచర్ మిడ్-పార్టెడ్ హెయిర్ స్టైల్ లో సారా తన రూపాన్ని పూసల బ్రాస్ లెట్ లు ఫంకీ బ్లూ ఫింగర్ రింగ్ బ్లూ రిమ్డ్ సన్ గ్లాసెస్ తో గుబులు రేపింది.

కొన్నిటిలో సారా ఒక స్విమ్మింగ్ పూల్ మెట్ల మీద పోజులిస్తూ క‌నిపించింది. నీలి సముద్రంలోకి విస్తరించిన‌ హోరిజోన్ లో నీలాకాశాన్ని తాకుతున్న‌ట్టుగా ఫోజులిచ్చింది. కొన్నిటిలో తన స్నేహితులతో పోజులిచ్చింది. సారా ఈ ఫోటోలకు అంద‌మైన‌ క్యాప్షన్ ఇచ్చింది ``పైన ఆకాశం చుట్టూ సముద్రం క్రింద ఇసుక.. ప్రవాహంతో వెళ్లు..`` అంటూ వ్యాఖ్య‌ను జోడించింది.

ఈ స్విమ్ వేర్ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ నిధి మునిమ్ లగ్జరీ లైన్- హౌస్ ఆఫ్ ఎన్‌. ఎమ్ నుంచి సంగ్ర‌హించిన‌ది. ఇది కస్టమ్ మేడ్ స్విమ్ వేర్  రిసార్ట్ వేర్.. జ్యువెల్ టోన్ లు హ్యాండ్ ఎంబ్రాయిడరీలలో ప్రత్యేకంగా టమ్మీ టక్కర్ ఫ్యాబ్రిక్స్ తో రూపొందించారు. సారా అలీ ఖాన్ ను ఈ లుక్ లో సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ అమీ పటేల్ తీర్చిదిద్దారు. సారా ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది. తీరిక స‌మ‌యాల్లో వ‌రుస విహార‌యాత్ర‌ల‌తో హీటెక్కిస్తోందిలా.