Begin typing your search above and press return to search.

వేల‌కోట్ల అధిప‌తి ప‌టౌడీ సంస్థాన రాకుమారి ముగ్ధ మ‌నోహ‌ర రూపం

By:  Tupaki Desk   |   3 Jun 2021 5:00 AM IST
వేల‌కోట్ల అధిప‌తి ప‌టౌడీ సంస్థాన రాకుమారి ముగ్ధ మ‌నోహ‌ర రూపం
X
ప‌టౌడీ సంస్థాన‌ రాకుమారి.. సైఫ్ అలీఖాన్ న‌ట‌వార‌సురాలు సారా అలీఖాన్ సోష‌ల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటారో తెలిసిందే. వేల కోట్ల సంస్థానాధీశురాలైనా డౌన్ టు ఎర్త్ నేచుర్ తో సారా ఇప్ప‌టికే అంద‌రి హృద‌యాల్ని కొల్ల‌గొట్టారు. త‌న‌కు సోష‌ల్ మీడియాల్లోనూ విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది.

ఇక సారా ఇన్ స్టా వేదిక‌గా త‌న ఫ్యామిలీ మ్యాట‌ర్స్ స‌హా ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్నారు. సోదరుడితో క‌లిసి ఉన్న ఫోటోగ్రాఫ్ లు.. విదేశీ వెకేష‌న్స్ కి సంబంధించిన వ‌రుస ఫోటోషూట్ల‌ను సారా ఇటీవ‌ల‌ షేర్ చేయ‌గా అవ‌న్నీ వైర‌ల్ అయ్యాయి.

తాజాగా మ‌రో బ్యూటిఫుల్ ఫోటోని సారా అలీఖాన్ షేర్ చేశారు. ఈ ఫోటోగ్రాఫ్ లో సారా మైమ‌రిపించే అంద‌చందాలు కుర్ర‌కారుకు గుండె ల‌య త‌ప్పేలా చేస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. సారా రియ‌ల్ ప్రిన్సెస్ నే త‌ల‌పిస్తోంది ఈ లుక్ లో. గోల్డ్ క‌ల‌ర్ లెహంగా.. క్రిస్ట‌ల్ డిజైన్స్ తో ఈ డిజైన‌ర్ డ్రెస్ సారా అందాన్ని ప‌దింత‌లు పెంచింది. ప‌ర్ఫెక్ట్ ఫిట్ డిజైన‌ర్ డ్రెస్ కి త‌గ్గ‌ట్టే మెడ‌లో క్రిస్ట‌లైన్ ఆభ‌ర‌ణం మ‌రింత వ‌న్నె తెచ్చింది. ప‌టౌడీ రాకుమారి ముగ్ధ మ‌నోహ‌ర రూపం ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా దూసుకెళుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సారా చివరిసారిగా కూలీ నెం 1 చిత్రంలో న‌టించింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజైంది. వరుణ్ ధావన్ ఇందులో హీరో. ఈ చిత్రం డేవిడ్ ధావన్ తెర‌కెక్కించిన‌ 1995 మూవీకి రీమేక్. నాటి చిత్రంలో గోవింద- కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సారా అలీఖాన్ అట్రాంగి రే చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ ఇచ్చి క‌శ్మీర్ వెకేష‌న్ ని ముగించారు. దులో ఆమె అక్షయ్ కుమార్ .. ధనుష్ లతో కలిసి సారా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.