Begin typing your search above and press return to search.

'సిండ్రెల్లా కథ'లు చెబుతాన‌న్న ప‌టౌడీ ప్రిన్సెస్

By:  Tupaki Desk   |   30 March 2021 10:06 PM IST
సిండ్రెల్లా కథలు చెబుతాన‌న్న ప‌టౌడీ ప్రిన్సెస్
X
అందానికి అందం ప్ర‌తిభ‌తో మెప్పిస్తున్న న‌వ‌నాయిక సారా అలీఖాన్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వార‌సురాలిగా ప‌టౌడీ సంస్థానం రాకుమారిగా సుప‌రిచిత‌మైనా త‌నదైన అణ‌కువ ఒదిగి ఉండే స్వ‌భావంతో అభిమానుల‌కు మ‌రింత చేరువైంది.

స‌మ‌కాలీన నాయిక‌ల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న భామ‌గా బాలీవుడ్ లో దూసుకుపోతోంది. సోష‌ల్ మీడియాల్లోనూ సారాకు అద్భుత ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌లే 66 వ ఫిలింఫేర్ అవార్డుల కార్య‌క్ర‌మంలో సారా త‌ళుకుబెళుకులు కుర్ర‌కారును క్లీన్ బౌల్డ్ చేశాయంటే అతిశ‌యోక్తి కాదు.

ఈ ఫోటోల్ని సారా స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. AADNEVIK అల్మారా మోడల్ నీలిరంగు దుస్తులు ధరించి కెమెరా ముందు హొయ‌లు పోయింది సారా. లేత నీలం రంగు నెయిల్ పెయింట్ ... ఉంగరాలను ధ‌రించి చురుకైన చూపుల‌తో డ్రీమ్ గాళ్ నే త‌ల‌పించింది. `సిండ్రెల్లా స్టోరీ` అంటూ సింపుల్ క్యాప్ష‌న్ తో బ‌ట‌ర్ ఫ్లై ఈమోజీల‌తో ఈ ఫోటోల్ని సారా షేర్ చేసింది. ప్ర‌స్తుతం న‌ట‌వార‌సురాలి ఫోటోలు అంత‌ర్జాలంలో వైరల్ గా మారాయి.

ఇటీవ‌ల అట్రాంగి రే చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న సారా లేటెస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఇందులో ఆమె అక్షయ్ కుమార్ .. ధనుష్ లతో కలిసి నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.