Begin typing your search above and press return to search.

సారా స్ట‌న్నింగ్ లుక్.. కంటికి కున‌కు క‌రువే!

By:  Tupaki Desk   |   20 Aug 2021 7:45 PM IST
సారా స్ట‌న్నింగ్ లుక్.. కంటికి కున‌కు క‌రువే!
X
బాలీవుడ్ ని న‌ట‌వార‌సురాళ్లు ఏల్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల అర‌డ‌జ‌ను ముంది స్టార్ కిడ్స్ వెండితెర‌కు ప‌రిచ‌య‌మై స్టార్లుగా వెలిగిపోతున్నారు. మ‌రో అర‌డ‌జ‌ను పైగా స్టార్ కిడ్స్ హిందీ చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం కానున్నారు. ఇందులో సైఫ్ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ఇప్ప‌టికే న‌వ‌త‌రం నాయిక‌గా దూసుకుపోతోంది.

సారా `కేదార్ నాథ్` చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆ చిత్రంలో హీరో. ఆ త‌ర్వాత ర‌ణ‌వీర్ స‌ర‌స‌న సింబా చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. అటుపైనా కెరీర్ ప‌రంగా బిజీ నాయిక‌గా వెలిగిపోతోంది. సారా అలీఖాన్ ఇటీవ‌ల అట్రాంగి రే చిత్రీక‌ర‌ణ‌లోనూ పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవ‌లే పూర్త‌యింది. ఇందులో అక్షయ్ కుమార్ .. ధనుష్ లతో కలిసి సారా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ సారా స్పీడ్ గానే ఉంది. ఇంత‌కుముందు ఇన్ స్టా వేదిక‌గా మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. తాజాగా సారా ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఇందులో ఈ క్యూట్ గాళ్ ఎంత సింపుల్ గా క‌నిపిస్తుందో అంత హాట్ గానూ ఎలివేట్ అయ్యింది. సారా పింక్ బ్రాలెట్ ధ‌రించి దానిపై ఊల్ కోట్ ని ధ‌రించింది. అలా సూటిగా చూస్తూ కుర్రాళ్ల కంటికి కునుకు క‌రువ‌య్యే ట్రీటిస్తోంది ఈ హాట్ బ్యూటీ.