Begin typing your search above and press return to search.

వీడియో : ముద్దుగుమ్మకు ఎంత బలమో!

By:  Tupaki Desk   |   15 July 2021 6:00 AM IST
వీడియో : ముద్దుగుమ్మకు ఎంత బలమో!
X
బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ ఒకప్పుడు వంద కేజీలకు కాస్త అటు ఇటుగా ఉండేది. ఆమె హీరోయిన్‌ అవ్వాలనే పట్టుదలతో ఎంతగా కష్టపడిందో పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వెయిట్‌ 60 కేజీలకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. బరువు తగ్గించేందుకు సారా పాటించిన ఆహార నియమాలు మరియు చేసిన వర్కౌట్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె కెరీర్‌ ఆరంభించినప్పటి నుండి కూడా మంచి ఫిజిక్ ను మెయింటెన్ చేస్తూ వచ్చింది. అందుకోసం రోజు గంటల తరబడి వర్కౌట్స్‌ చేస్తుంది.

తాజాగా సారా అలీ ఖాన్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో సారా తన స్నేహితురాలిని వెయిట్‌ లిఫ్టింగ్‌ మాదిరిగా ఎత్తుకోవడం చూడవచ్చు. వెయిట్‌ లిఫ్ట్ ఎలా అయితే ఎత్తి కిందుకు మళ్లీ పైకి అంటామో అలాగే సారా కూడా తన స్నేహితురాలిని అలాగే లిప్ట్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపుగా తన వెయిట్ ఉన్న ఆమెను సారా సునాయాసంగానే లిఫ్ట్‌ చేసిందంటే ఆమె బలం ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక సైఫ్‌ అలీ ఖాన్ కూతురుగా ఇండస్ట్రీకి కేదార్‌ నాథ్ సినిమాతో పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది... ప్రస్తుతం కూడా ఈమె ఖాతాలో చాలా సినిమాలే ఉన్నాయి. కరోనా కారణంగా కాస్త మెల్లగా ఈమె సినిమాల ఎంపిక ఉంది. ముందు ముందు ఈమె ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉందట. మంచి కథలను ఎంపిక చేసుకుంటూ మంచి నటిగా గుర్తింపు దక్కించుకోవాలని కూడా కోరిక అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.