Begin typing your search above and press return to search.

చూపులతో చంపేస్తున్న స్టార్ డాటర్

By:  Tupaki Desk   |   19 Aug 2018 6:20 AM GMT
చూపులతో చంపేస్తున్న స్టార్ డాటర్
X
స్టార్ హీరోల వారసులకు ఓ గొప్ప వరం ఇచ్చాడా దేవుడు. ఇంకా తెరకు పరిచయం కాకుండానే వాళ్ళ కోసం వేచి చూస్తున్న అభిమాన సందోహం రెడీగా ఉంటుంది. అందుకే తమ బిడ్డలను సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు హీరో హీరోయిన్లు తెగ తాపత్రయపడిపోతుంటారు. ఇప్పటికే అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ తనకంటూ ఒక మార్క్ సృష్టించుకోగా శత్రుజ్ఞ సిన్హా గారాల పట్టి సోనాక్షి సిన్హా సల్మాన్ లాంటి పెద్ద హీరోల సరసన సైతం బెరుకు లేకుండా నటించింది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ వంతు వచ్చింది. సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ ద్వారా కలిగిన సారా అలీ ఖాన్ ఎంట్రీ అతి త్వరలో జరగనుంది. తెలుగులో యంగ్ టైగర్ కు మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచిన టెంపర్ హిందీ రీమేక్ సింబా ద్వారా త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో రన్వీర్ సింగ్ కు జోడిగా కాజల్ చేసిన పాత్రలో మెరవనుంది. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం చాలా అవసరం కాబట్టి సారా ఆలస్యం చేయకుండా ఆగష్టు 15 మంచి ముహూర్తం చూసుకుని ఇన్ స్టాగ్రామ్ లో అడుగు పెట్టేసింది. స్టార్ట్ చేయటం ఆలస్యం మూడంటే మూడు రోజుల్లో ఫాలోయర్లు మూడు లక్షలు దాటేసారు.

తాజాగా కైపిచ్చేలా మత్తైన కళ్ళతో ఇచ్చిన ఒక స్పైసి స్టిల్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో స్కిన్ షో ఏమి లేకపోయినా ఏదో మేజిక్ చేసేలా చూస్తున్న చూపుతో అభిమానులను పడగొట్టే ప్రయత్నం చేస్తోంది సారా. అసలే అమ్మ పోలిక. ఒకప్పుడు అమృతా సింగ్ కూడా ఇదే తరహాలో అప్పటి యూత్ కు సినిమాల ద్వారా నిద్ర లేని రాత్రులు మిగిల్చేది. పైగా అందగాడు ఆజానుబాహుడు సైఫ్ పోలికలు కలిస్తే ఇంకా చెప్పేదేముంది. అందుకే సారాకు ఆఫర్స్ విషయంలో దిగులు లేదు. తమ సినిమాల్లో చేయమని అడుగుతున్న నిర్మాతలు చాలానే ఉన్నారట. సవతి తల్లి కరీనా కపూర్ తో మంచి సంబంధాలే నెరుపుతున్న సారా బుల్లి తమ్ముడు తైమూర్ తో కూడా బాండింగ్ పెట్టుకుందట. డెబ్యూ మూవీ విడుదల కోసం తల్లి అమృతాతో పాటు వీళ్లంతా ఎదురు చూస్తున్నారు. సైఫ్ మాత్రం తన వారసురాలు ఖచ్చితంగా రుజువు చేసుకుంటుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు.