Begin typing your search above and press return to search.

ఈ వయ్యారి వర్కౌట్ వీడియోతో కుర్రాళ్లను అవుట్ చేస్తోందిగా..

By:  Tupaki Desk   |   22 Jan 2021 1:10 PM GMT
ఈ వయ్యారి వర్కౌట్ వీడియోతో కుర్రాళ్లను అవుట్ చేస్తోందిగా..
X
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆ వయ్యారి యువతకు బాగా సుపరిచితమే. సినిమాలతో, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు రోజురోజుకి మరింత చేరువ అవుతూనే ఉంది. ఈ వయ్యారి ఇప్పుడు ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సినిమాలలో ఎంతో అందంగా కనిపించే సారా.. అంత అందంగా కనిపించడానికి కారణం ఫిట్నెస్. సినిమా హీరోయిన్ అంటే శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. అందుకే ఎల్లప్పుడూ జిమ్ వర్కౌట్స్, వ్యాయామం చేస్తూ కనిపిస్తుంది సారా. ప్రస్తుతం అమ్మడు ఫేమస్ హాలిడే స్పాట్ మాల్దీవ్స్ కి వెళ్ళింది. అక్కడే ఈ భామ తన విలువైన టైంను బాగా ఎంజాయ్ చేస్తోంది. తను వర్కౌట్స్ తో పాటు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది సారా.

అయితే ఈ కుర్రభామ ఇలా పోస్ట్ చేసిందో లేదో తాజా వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. అసలే సారా 30 మిలియన్ లకు పైగా ఇంస్టాగ్రామ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా ఉయ్యాల ఊగుతూ వర్కౌట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తాడు మీద బోర్లాపడుకొని వీకెండ్ వర్కౌట్స్ అంటూ ఊగుతూ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఉయ్యాల ఊగడం అనేది కూడా ఫిట్నెస్ లో భాగమే అంటోందట వయ్యారి. వర్కౌట్ డ్రెస్ లో నిజంగా సారా కుర్ర హృదయాలలో చిచ్చు రేపిందని చెప్పవచ్చు. అంతలా కళ్ళప్పగిస్తున్నారు కుర్రాళ్లు. సారా మేనిఛాయకు ఎలాంటి మగవారైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటుంది సారా. కేదారనాథ్, సింబా, లవ్ ఆజ్ కల్, కూలి నెంబర్ వన్ సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులను పలకరించి మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.