Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ కాఫీ సాక్షిగా స్టార్ డాట‌ర్ ఎఫైర్ గుట్టు ర‌ట్టు

By:  Tupaki Desk   |   10 July 2022 5:08 AM GMT
క‌ర‌ణ్ కాఫీ సాక్షిగా స్టార్ డాట‌ర్ ఎఫైర్ గుట్టు ర‌ట్టు
X
కాఫీ విత్ క‌ర‌ణ్ షో బోలెడ‌న్ని నిజాల్ని బ‌య‌ట‌పెడుతోంది. ముఖ్యంగా క‌థానాయిక‌ల ఎఫైర్ క‌హానీల‌ను వెలుగులోకి తెస్తోంది. హీరోలతో సీక్రెట్ ప్రేమాయ‌ణాలు రొమాన్స్ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌ను తెర ముందుకు తెచ్చేస్తుండ‌డంతో ఈ ఓటీటీ షో దూసుకెళుతోంది. ప్ర‌తిసారీ కొత్త ప్రోమోల‌తో వేడి పెంచ‌డంలో కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7 అంత‌కంత‌కు టీఆర్పీల్లో రైజ్ అవుతోంది.

తాజాగా ప్ర‌ముఖ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ డేటింగుల గుట్టు ఈ వేదిక‌పై ర‌ట్ట‌య్యింది. ఇటీవలి ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్- కార్తీక్ ఆర్యన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని కరణ్ జోహార్ ధృవీకరించారు.

బాలీవుడ్ నటులు కార్తీక్ ఆర్యన్ - సారా అలీ ఖాన్ తరచుగా ఎఫైర్ వార్త‌ల‌తో హెడ్ లైన్స్ లోకి వ‌చ్చిన‌ సంగ‌తి తెలిసిందే. ఇద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కార్తీక్ - సారా బహిరంగంగా తమ సంబంధాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. కరణ్ జోహార్ తాజా షోలో ఈ జంట‌ చాలా స‌న్నిహితంగా ఉన్నారని ధృవీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవలి ఇంటర్వ్యూలో KJo తన షో `కాఫీ విత్ కరణ్ 7` ప్రమోషన్స్ సందర్భంగా తన చాట్ షోలో సారా ప్రేమాయ‌ణం గుట్టు మ‌ట్లు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని క‌రణ్ దీనిపై లీకిచ్చార‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

కాఫీ కౌచ్ అనేది లింక‌ప్ ల మ్యాట‌ర్స్ లీక్ చేస్తుంద‌నేది యూత్ కి క‌నెక్టివిటీ పాయింట్. దీనిని క‌ర‌ణ్ తెలివిగా స‌ద్వినియోగం చేసుకుంటున్నాడు. క‌ర‌ణ్ ముందు ఈసారి సోఫాలో ఉన్న కత్రినా విక్కీతో బాగా కనిపిస్తానని అనుకుందిట‌. ఆ త‌ర్వాత క‌త్రిన ఎఫైర్ మొద‌లైంది. ఆపై ఈ జంట‌ వివాహం చేసుకున్నారు. సారా అలీ ఖాన్ కూడా క‌ర‌ణ్ ముందు కార్తీక్ (ఆర్యన్) గురించి ప్రస్తావించారు. కార్తీక్ తో డేటింగ్ ను చేశాన‌ని అంగీక‌రించింద‌ట‌.

సారా - కార్తీక్ ఆర్యన్ జంట ఇంత‌కుముందు ఇంతియాజ్ అలీ తెర‌కెక్కించిన `లవ్ ఆజ్ కల్ 2`లో న‌టించారు. ఈ జంట‌ కెమిస్ట్రీ అభిమానులకు బాగా నచ్చింది. ఇంత‌కుముందు ఓ ఇంటర్వ్యూలో వారి డేటింగ్ ఊహాగానాలు కేవలం సినిమాని ప్రమోట్ చేయడానికి చేసిన జిమ్మిక్కా? అని కూడా కార్తీక్ ని అడిగారు. వాళ్లు కూడా మనుషులే కాబట్టి అంతా ప్రమోషనల్ కాదు అని కార్తీక్ ఆర్యన్ స్పష్టం చేశాడు.

ఇంతలోనే KWK 7 షోలో సారా అలీఖాన్ క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే మొదటి ఎపిసోడ్ కు అలియా భట్ - రణవీర్ సింగ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచారు. కరణ్ జోహార్ ప్రస్తుతం విక్కీ కౌశల్ - సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి షో షూటింగ్ చేస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఈ సీజన్ కు అక్షయ్ కుమార్- అనీల్ కపూర్- వరుణ్ ధావన్- జాన్వీ కపూర్- సారా అలీ ఖాన్- విజయ్ దేవరకొండ- సమంతా రూత్ ప్రభు- షాహిద్ కపూర్- కియారా అద్వానీ తదిత‌రులు అతిథులుగా క‌నిపిస్తారు.