Begin typing your search above and press return to search.

పార్టీ కరీనాదే.. ఫోకస్ కూతురుది..

By:  Tupaki Desk   |   23 Sep 2016 5:31 AM GMT
పార్టీ కరీనాదే.. ఫోకస్ కూతురుది..
X
తెలుగు సినిమాల కారణంగా సవతి కూతురు అన్న పేరు.. బాగా వేరియేషన్ కి గురయిపోయింది కానీ.. మన దగ్గర మినహాయిస్తే.. చాలా చోట్ల ఆ తేడాని రియల్ లైఫ్ లో చూపించరు. ఆ విషయం బాలీవుడ్ బెబో బర్త్ డే లో మరోసారి నిరూపితమైంది. డిసెంబర్ లో అమ్మ కానున్న కరీనా కపూర్‌.. సెప్టెంబర్ 21న తన బర్త్ డే వేడుకలను జరుపుకుంది. 36లోకి ఎంట్రీ ఇస్తున్న బెబో.. సన్నిహితులు-బంధువులు- స్నేహితులతో ఈ సెలబ్రేషన్ చేరుకుంది.

అసలే గర్భవతిగా ఉన్న భార్య బర్త్ డే.. మరి భర్త సైఫ్‌ అలీఖాన్‌ రాకుండా ఉంటాడా. ఇటు కరీనా అక్క కరిష్మా కపూర్‌ - బ్రదర్ రణ్‌ బీర్‌ కపూర్‌ లు కూడా ఈ పార్టీలో కనిపించారు. వీరే కాకుండా చాలామంది కపూర్‌ లు - ఖాన్‌ లు కూడా బెబో బర్త్ డే ఫంక్షన్ లో సందడి చేశారు. ఇలా చాలామంది సెలబ్రిటీలు అక్కడ కనిపించినా.. అందరికంటే ఎక్కువగా ఫోకస్ అయింది మాత్రం.. ఒక్క కుర్ర భామే. తనే సైఫ్‌ అలీఖాన్‌ మొదటి భార్య కూతురు సారా అలీఖాన్‌. ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఈ భామ.. కరీనా ఫంక్షన్ మొత్తంలో సెంట్రాఫ్ అట్రాక్షన్ అయిపోయింది.

త్వరలో ఈ భామ హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. కరణ్‌ జోహర్‌ తెరకెక్కిస్తున్న 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2'లో టైగర్‌ ష్రాఫ్‌ కి జంటగా సారా ఎంట్రీ ఇవ్వనుందట. ఇలాంటి టైంలో పిన్ని ఫంక్షన్ లో నాభి అందాలు ఆరేస్తూ కనిపించిన ఈ భామ.. బాగా ఫోకస్ అయిపోయింది.