Begin typing your search above and press return to search.

బికినీలో ఆద‌మ‌రిస్తే ఎలా న‌ట‌ వార‌సురాలా?

By:  Tupaki Desk   |   12 Nov 2022 6:50 AM IST
బికినీలో ఆద‌మ‌రిస్తే ఎలా న‌ట‌ వార‌సురాలా?
X
అందాల యువ‌నాయిక‌ సారా అలీ ఖాన్ కెరీర్ స్పీడ్ బిజీ లైఫ్ గురించి తెలిసిందే. ఏమాత్రం అవ‌కాశం చిక్కినా బీచ్ వెకేష‌న్ తో రిలాక్స్ అవుతుంది సారా. ఇంత‌కుముందు మాల్దీవులు స‌హా గోవా వెకేష‌న్ల నుంచి వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేసింది. యూరోపియ‌న్ ట్రిప్ నుంచి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. తన సోషల్ మీడియాల‌ ద్వారా తన వ్యక్తిగత వృత్తిగ‌త‌ జీవితంలోని స్నీక్ పీక్ లను షేర్ చేయ‌డాన్ని అస్స‌లు మ‌రిచిపోదు.

సారా ఇన్ స్టా అభిమానులు దానిలోని ప్రతి బిట్ ను ఆరాధిస్తారు. తరచుగా సారా తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ లేదా సన్నిహితులతో కలిసి ముంబై నగరం నుండి బయటకు వెళ్లినప్పుడు ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తరచుగా మంత్రముగ్దులను చేసే ప్రదేశాల‌ను సారా సందర్శిస్తుంది. నమస్తే దర్శకన్ సిరీస్ పేరుతో ఈ ఫోటోల‌ను షేర్ చేస్తుంటుంది.

పటౌడీ యువరాణి సారా మళ్లీ వెకేష‌న్ మోడ్ లోకి వ‌చ్చేసింది. వ‌రుస‌గా ప్రయాణాల‌తో కాలం గ‌డిపేస్తోంది. ఎంతో అంద‌మైన‌ ఉత్కంఠభరితమైన ప్రదేశాల నుంచి తన ఫోటోలను సారా షేర్ చేసింది. ఈ ఫోటోలు యూత్ ని టీజ్ చేస్తున్నాయ‌ని చెప్పాలి. వెంట‌నే బ్యాగ్‌లను సర్దుకుని విహారయాత్రకు బయలుదేరాల‌నిపించే కిక్ ని ఇస్తున్నాయి!

శుక్రవారం ఇన్‌స్టాలో తన అద్భుతమైన ఫోటోలను సారా షేర్ చేయ‌గానే అంత‌ర్జాలంలో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయ్యాయి. ముఖ్యంగా వీటిలో మొదటి ఫోటో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. సారా సెక్సీ మోనోకినిలో బెంచ్ పై విశ్రాంతి తీసుకుంటోంది. అలా ఆద‌మ‌రిచి క‌నులు మూసి నిదురిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ తర్వాత ఆమె వాలుగా ఉన్న కొబ్బ‌రి చెట్టుపై నిలబడి పోజులిచ్చిన ఫోటో .. సముద్రం దగ్గర ధ్యానం చేస్తున్న స్నాప్... చివరిది సారా మంచుతో కప్పి ఉన్న‌ పర్వతాల మధ్య పోజులు వైర‌ల్ గా మారాయి. వీటికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ``నా స్వ‌భావ రీత్యా .. నాలో కళ కవిత్వం ఉన్నాయి. అది సరిపోకపోతే ఏది సరిపోతుంది?`` అంటూ విన్సెంట్ వాన్ గోగ్ క్యాప్ష‌న్ ని సారా షేర్ చేసింది. ఈ పోస్ట్ ని షేర్ చేయగానే వెంటనే అభిమానులు పొగడ్తలు కురిపించారు.. మనీష్ మల్హోత్రా కూడా హార్ట్ ఎమోజీలను షేర్ చేసారు.

కెరీర్ మ్య‌ట‌ర్ కి వ‌స్తే సారా ఇటీవల విక్కీ కౌశల్ `ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ` నుండి నిష్క్రమించినట్లు క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. URI: సర్జికల్ స్ట్రైక్ తర్వాత కోవిడ్-19 మహమ్మారి కారణంగా నిరవధిక వాయిదాల‌తో ఆ మూవీ చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైంది. దర్శకుడు ఆదిత్య ధర్ తో విక్కీ చేతులు కలపడానికి సిద్ధమవుతున్నాడు. చాలా అంచనాల న‌డుమ ఈ చిత్రం 2020 లో సెట్స్ పైకి తీసుకె0ళ్లాలని షెడ్యూలింగ్ చేసారు. కానీ ఆ తరువాత నిలిపివేశారు. అయితే ది ఇమ్మోర్టల్ అశ్వత్థామను మేకర్స్ పునరుజ్జీవింపజేస్తున్నట్లు తరువాత క‌థ‌నాలొచ్చాయి.

ప్ర‌ముఖ జాతీయ మీడియా వివ‌రాల‌ ప్రకారం.. సారా అలీ ఖాన్ ఇకపై ఈ ఆదిత్య ధర్ దర్శకత్వంలో భాగం కాదు. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామను పునరుద్ధరించడానికి చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ తారాగణంలో మార్పును అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. విక్కీని కథానాయకుడిగా ఉంచాలని ద‌ర్శ‌కుడు పట్టుబట్టగా.. మేకర్స్ సారాను తారాగణం నుండి తొలగించడానికి గల కారణం వెల్లడించాల్సి ఉంటుంది.

చిత్ర‌బృందానికి స‌న్నిహితులు దీని గురించి మాట్లాడుతూ.. సినిమా నిరవధికంగా వాయిదా వేశాక‌ తర్వాత రీరైటింగ్ లో భాగంగా స్క్రిప్ట్ కూడా మారింది` అని తెలిపారు. సవరించిన స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ, -``మునుపటి స్క్రిప్ట్ ఒక యువతికి అవ‌కాశం ఉంద‌ని డిమాండ్ చేయగా సారాను ఎంపిక చేసారు. అయితే డేట్స్ క్లాష్ అవ్వడం .. పాత్ర మార్పు తో అది ఇకపై సాధ్యం కాదని క‌థ‌నాలొస్తున్నాయి.

``ప్రస్తుత స్థితిలో ఉన్న స్క్రిప్ట్ కు విక్కీ సరసన నటించడానికి కొంచెం పాత నటి అవసరం. అందువల్ల ఇప్పుడు మేకర్స్ ఇతర ఆప్ష‌న్స్ ని ప‌రిశీలిస్తున్నారు`` అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సారా స్థానంలో వేరొక‌రిని భర్తీ చేయాలనే మేకర్స్ నిర్ణయం చ‌ర్చ‌ల్లోకొచ్చింది.

కాఫీ విత్ క‌ర‌ణ్ చాట్ షోలో మాట్లాడుతూ... కరణ్ జోహార్ ఇటీవల సారా తనతో 2 చిత్రాలకు ప‌ని చేసేందుకు క‌మిటైంద‌ని ధృవీకరించారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది కాకుండా.. సారా అలీ ఖాన్ చివరిసారిగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఫాంటసీ డ్రామా చిత్రం అత్రంగి రేలో కనిపించారు. ధ‌నుష్‌- అక్ష‌య్ ఇందులో హీరోలు. తదుప‌రి నిర్మాత దినేష్ విజన్ -దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తదుపరి చిత్రంలో విక్కీ కౌశల్ తో కలిసి నటిస్తుంది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. ఈ చిత్రం Uri: The Surgical Strike నటుడితో ఆమె మొదటి ప్రాజెక్ట్ కానుంది. విక్రాంత్ మాస్సే- చిత్రాంగద సింగ్‌తో పవన్ కృప్లానీ గ్యాస్ లైట్ మూవీలోను నటించ‌నుంది.