Begin typing your search above and press return to search.

సైఫ్ కూతురు భలే కవర్ చేస్తోందే

By:  Tupaki Desk   |   17 Jun 2017 12:26 PM GMT
సైఫ్ కూతురు భలే కవర్ చేస్తోందే
X
సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ వెండితెర పై వెలిగేది ఎప్పుడాని బాలీవుడ్ లో అందరూ వేచిచూస్తున్నారు. అందరి ఆశలకు తగ్గట్లుగానే ఆమె కూడా పార్టీలతో సోషల్ మీడియా పోస్టులతో తన ఎంట్రీ టీజర్ ను సిద్దం చేసుకుంటోంది. ఇప్పుడు మీడియా కెమెరా కళ్ళన్నీ ఈమె పైనే పెట్టాయి. సారా కదిలకను అణువు అణువు వదలకుండా వెంటాడుతున్నాయి.

సుశాంత్ రాజ్పుత్ హీరోగా అబిషేక్ కపూర్ డైరెక్టర్ గా రాబోయే సినిమా ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ అవుతోంది సారా. ముందు లో కరణ్ జోహర్ సినిమా ద్వారా డెబ్యుట్ అవుతుంది అనుకున్నారు కానీ ఎందుకో కుదరలేదు. అయితే ఈ సినిమా న్యూస్ లీకవ్వడంతో అమ్మడికి ఫోటోగ్రాఫర్ల తాకిడి కూడా బాగా పెరిగిపోయింది. దానితో అమ్మడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా.. ఒక ఫైల్ తోనో.. ఒక పర్సుతోనే ముఖానికి చెయ్యి అడ్డుపెట్టుకుంటోంది. అస్సలు తన ఫేస్ కనపబడకుండా బాగా కవర్ చేసుకుంటోంది. ఇంకా స్టార్ హీరోయిన్ కాక ముందే అమ్మడికి హీరోయిన్ తరహాలో కవరింగ్ భలే వచ్చేసిందే అంటూ బాలీవుడ్లో ఇప్పుడు అమ్మడిపై అందుకే కామెంట్లు పడుతున్నాయి.

ఇకపోతే సారా అలీ ఖాన్ , సుశాంత్ రాజ్పుత్ సినిమా దాదాపుగా ఖరారు అయినట్లే కానీ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. సినిమా ఇండస్ర్టీలో మొదలయ్యే వరకు ఏ ప్రాజెక్టునూ నమ్మలేం. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/