Begin typing your search above and press return to search.

అర‌వ‌తంబీ పంచె క‌ట్టులా ఊర‌మాస్ ఈ పాల‌పిట్ట‌!

By:  Tupaki Desk   |   1 Feb 2020 6:40 AM GMT
అర‌వ‌తంబీ పంచె క‌ట్టులా ఊర‌మాస్ ఈ పాల‌పిట్ట‌!
X
స్టెప్ మామ్ తో కూతురు బాంధ‌వ్యం గురించి ఏమ‌ని చెప్పాలి? ఆ ఇద్ద‌రి అన్యోన్య‌త బాలీవుడ్ లో ఆల్ టైమ్ హాట్ టాపిక్. స్టెప్ డాట‌ర్ అయినా సారా అలీఖాన్ ఎదుగుద‌ల కోసం క‌రీనా ఎంతో చేస్తోంది. ఇక క‌రీనా అంటే సారాకు అంతే అభిమానం. సైఫ్ - క‌రీనా దంప‌తుల బిడ్డ తైమూర్ అలీఖాన్ తో ఎంతో ప్రేమ‌గా ఉంటుంది సారా. ఇక ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒకే వేదిక‌పైకి వ‌స్తే చూప‌రుల‌కు క‌న్నుల‌పండుగే అన‌డంలో సందేహ‌మేం లేదు.

కరీనా కపూర్ ఖాన్ చాట్ షో `వాట్ ఉమెన్ వాంట్` చాలా కాలంగా టీవీక్ష‌కుల్ని అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రతి ఎపిసోడ్ కోసం ప్రముఖులను ఆహ్వానిస్తూ కరీనా వారితో ఆసక్తికర విష‌యాల్ని ముచ్చ‌టిస్తూ ర‌క్తి క‌ట్టిస్తోంది. ఇందులో ఫ‌న్ విభాగంలో చమత్కారమైన ప్రశ్నలతో ఇరుకున పెడుతుంటుంది. గ‌తంలో తాప్సీ పన్నూ- సోనాక్షి సిన్హా -కార్తీక్ ఆర్యన్ త‌దిత‌ర బి-టౌన్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా సారా అలీ ఖాన్ సవతి తల్లి కరీనా `వాట్ ఉమెన్ వాంట్` షోలో సంద‌డి చేసింది. ఇంటర్వ్యూకి ముందు నటి కరీనా తో కలిసి సారా ఇదిగో ఇలా పోజులిచ్చింది. కరీనా స్ట‌న్నింగ్ పింక్ జంప్ సూట్ లో స్టైలిష్ గా క‌నిపించింది. మ‌రోవైపు.. స్టైలిష్ బ్లూ షర్ట్ - పింక్ షిమ్మర్ స్కర్ట్ ధరించి సారా చాలా పెప్పీ గా క్లాస్సీగా కనిపించింది. కాస్త ప‌రిశీల‌న‌గా చూస్తే సారా లుక్ పూర్తి మాసీ స్టైల్లో క‌నిపిస్తోంది. అర‌వతంబీ పంచె క‌ట్టినట్టుగా మాసీగా ఉందా లుక్. ఆ ఇద్ద‌రూ తొడిగిన షర్ట్ డిజైనింగ్ స్టైల్ కాస్త వ‌దులుగా సంథింగ్ స్పెష‌ల్ గానే క‌నిపిస్తోంది. ఇక సారా వ‌దులు ష‌ర్ట్ హ్యాండ్స్ ని మ‌డ‌త పెట్టి మాస్ అప్పీల్ తో క‌నిపించ‌డం ఆక‌ట్టుకుంటోంది.

ఇక కెరీర్ ప‌రంగా చూస్తే.. కరీనా- సారా బాలీవుడ్ లోని ఎ-లిస్టర్స్ జాబితా లో ఉన్నారు. యువ నాయిక‌ సారా కూడా అద్భుత నటిగా - ఫ్యాషనిష్టాగా ఇప్ప‌టికే పాపులారిటీని ద‌క్కించుకుంది. కేవ‌లం మూడు సినిమాల కిడ్ అయినా త‌న‌కు ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణం అనే చెప్పాలి. సారా న‌టించిన `ల‌వ్ ఆజ్ క‌ల్` రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్ స‌ర‌స‌న న‌టిస్తున్న మ‌రో సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా మొద‌లైంది.