Begin typing your search above and press return to search.

సైఫ్ కూతురి సెలూన్ రచ్చ!!

By:  Tupaki Desk   |   19 July 2017 4:49 AM GMT
సైఫ్ కూతురి సెలూన్ రచ్చ!!
X
స్టార్ కిడ్స్ పబ్లిక్ లో హంగామా చేస్తుండడం పలు మార్లు కనిపిస్తుంది. వీలైనంత వరకూ జనాల్లో ఏదైనా హంగామా జరిగే అవకాశం ఉంటే ఎస్కేప్ అయేందుకు ప్రయత్నిస్తారు కానీ.. వారి తప్పు ఉందనే ఆరోపణ వినిపిస్తే మాత్రం తట్టుకోలేక.. తెగ రచ్చ చేసేస్తుంటారు. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కూడా రీసెంట్ గా ఇలాగే హంగామా చేసిందని బాలీవుడ్ మీడీయా అంటోంది.

ముంబైలోని ఓ ఫేమస్ సెలూన్ వెళ్లిన సారా.. తనతో పాటు తన స్నేహితురాలు రియాను కూడా వెంటబెట్టుకుని వెళ్లింది. అక్కడ తమకు కావలసిన సర్వీసులు అన్నీ పొందిన తర్వాత.. పేమెంట్ కోసం ఎప్పటిమాదిరిగానే కార్డులను ఇచ్చారట. అయితే.. అసలు హంగామా ఇక్కడే మొదలైంది. వీరు ఇచ్చిన కార్డులు రెండూ డిక్లైన్ కావడంతో.. అదే విషయాన్ని వారికి తెలియచేశాడట మేనేజర్. సరిగ్గా స్వైపింగ్ చేయడం కూడా రాదా అంటూ సారా అండ్ రియా తెగ హంగామా చేశారట. అయితే.. మరోసారి ప్రయత్నించినపుడు కూడా ఇదే జరగడంతో.. ఖంగు తినేశారట వీరిద్దరూ.

అయితే.. సెలూన్ లో ఉన్న జనాల ముందు పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో.. తిరిగి సెలూన్ మేనేజర్ పై ఇద్దరూ తెగ అరిచేశారని తెలుస్తోంది. సెలూన్ లో ఉన్నవారు కూడా ఈ స్టార్ కిడ్స్ చేస్తున్న రచ్చ చూసి తెగ ఆశ్చర్యపోయారట. ఇంతలో అక్కడకి ఫోటోగ్రాఫర్స్ చేరడంతో.. తన మొహాన్ని స్కార్ఫ్ లో దాచుకుని అక్కడి నుంచి తుర్రుమంది సారా. కానీ ఆమె స్నేహితురాలు రియా మాత్రం స్పష్టంగా కెమేరాలకు చిక్కేసింది.