Begin typing your search above and press return to search.

డైరక్టర్ తో గుడికి కూడా వెళ్ళిందే...

By:  Tupaki Desk   |   12 Jun 2017 7:09 AM GMT
డైరక్టర్ తో గుడికి కూడా వెళ్ళిందే...
X
ఇప్పుడు బాలీవుడ్ లో మరో కొత్త సెట్ స్టార్ కిడ్స్ హంగామా మొదలవ్వబోతోంది. చాలామంది స్టార్లు కూతుళ్లు మనరాళ్ళు హీరోయిన్లు అవ్వడానికి సిద్దమవుతున్నారు. ఎవరు చూసినా కూడా సోషల్ మీడియా సాక్షిగా తమ సెక్సీ లుక్స్ తో నానా రచ్చ చేస్తున్నారంతే. ముఖ్యంగా నవ్య నవేలి నందా.. ఆలియా ఇబ్రహీం.. సారా ఆలి ఖాన్ వంటి భామలు పిచ్చెత్తిస్తున్నారంతే. వీళ్ళందరిలో ముందుగా సైఫ్‌ ఆలీ ఖాన్ కూతురే డెబ్యూ చేయబోతోంది.

అయితే ఇప్పటివరకు అసలు సారా ఆలీ ఖాన్ డెబ్యూ గురించి అన్నీ ఊహాగానాలే అని అందరూ చెప్పారు. రాక్ ఆన్.. ఫితూర్ వంటి సినిమాలను తీసిన అభిషేక్ కపూర్ డైరక్షన్లో ఇప్పుడు సుశాంత్ రాజ్పుత్ హీరోగా ఒక ప్రేమ కథ రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సారా ఆలీ ఖాన్ తెరంగేట్రం చేస్తుందని టాక్. మొన్ననే ఈ ముగ్గురూ ముంబయ్ లోని బాంద్రాలో ఒక కాఫీ షాపు నుండి కలసి బయటకు వస్తుండటంతో.. ఈ కాంబినేషన్ ఓకె అయ్యింది అనుకున్నారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌ లో లొకేషన్ల రెక్కీకి వెళ్ళిన అభిషేక్.. అక్కడ కేదారనాథ్ దేవాలయాన్ని సందర్శించుకున్నాడు. ఆ సమయంలో అతని ప్రక్కనే సారా ఆలీ ఖాన్ కూడా ఉంది. డైరక్టర్ తో కలసి గుడికి కూడా వెళ్ళిందంటే.. ఇక ఈ అమ్మాయి డెబ్యూ కన్ఫామ్ అనే అనుకోవాలిగా.

దాదాపు ఓ సంవత్సరం క్రితం కరీనా కపూర్ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్లో.. తన పిన్నిని విష్ చేయడానికి నాభి అందాలన్నీ కనిపించేలా విచ్చేసింది సారా. అప్పటినుండి తారాలోకం అంతా ఈ అమ్మాయి రాక కోసం వేచి చూస్తోందనే చెప్పాలి. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/