Begin typing your search above and press return to search.

విజ‌య్ దేవ‌ర‌కొండ టూ హాట్ అంటోంది

By:  Tupaki Desk   |   11 Dec 2021 5:00 AM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ టూ హాట్ అంటోంది
X
విజ‌య్ దేవ‌ర‌కొండ కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగాచెప్పాల్సిన ప‌ని లేదు. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అదే త‌ర‌హా క్రేజ్ బాలీవుడ్ లోనూ ఏర్ప‌డింది. అయితే అత‌నికి హీరోయిన్ ల‌లోనూ భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. టాలీవుడ్ లో ఇప్ప‌టికే భారీ స్థాయిలో హీరోయిన్‌ల‌కు హాట్ ఫేవ‌రేట్ గా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే బాలీవుడ్ హీరోయిన్‌ల‌లోనూ అదే క్రేజ్ క‌నిపిస్తోంది.

కియారా అద్వానీతో పాటు ఆ మ‌ధ్య అతిలోక సుంద‌రి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ కూడా విజ‌య్‌పై మ‌న‌సు ప‌డ‌టం.. అత‌నితో క‌లిసి న‌టించాల‌ని వుంద‌ని త‌మ విష్‌ని బ‌య‌ట‌పెట్ట‌డం తెలిసిందే. ఇదిలా వుంటే తాజాగా మ‌రో క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ఆస‌క్తిక‌ర కామెంట్ లు చేయ‌డం వైర‌ల్‌గా మారింది.బాలీవుడ్ హీరో సైఫ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్ తాజాగా త‌న మ‌న‌సులోని మాట‌ని బ‌య‌ట‌పెట్టింది. విజ‌య్ దేవ‌ర‌కొండ తో క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని వుంద‌ని, అత‌ను చాలా హాట్ అని ఓపెన్‌గా చెప్పేసింది.

ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో సారా అలీఖాన్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. `అత్‌రంగీరే` ర‌హాలో స్వ‌యంవ‌రంలో ముగ్గురిని పెళ్లాడాల్సి వ‌స్తే ఎవ‌రెవ‌రిని పెళ్లాడ‌తార‌ని అడిగితే ర‌ణ్ వీర్‌ సింగ్, వ‌రుణ్ ధావ‌న్, విక్కీ కౌశ‌ల్ ల‌ని పెళ్లాడ‌తాన‌ని చెప్పేసింది. అంతే కాకుండా ర‌ణ్ వీర్ సింగ్ కి తాను మాసీవ్ ఫ్యాన్ ని అని క్లారిటీ ఇచ్చేసింది. సౌత్ హీరోల్లో ధ‌నుష్ త‌రువాత ఎవ‌రితో క‌లిసి న‌టించాల‌నుకుంటున్నార‌ని అడిగితే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అని ట‌క్కున చెప్పేసింది. అంతే కాకుండా అత‌ను చాలా హాట్ అని త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట‌పెట్టేసింది. సారా రాపిడ్ ఫైర్ కి సంబంధించిన ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.