Begin typing your search above and press return to search.
సప్తగిరి.. స్వాతికి మావయ్యాడా?
By: Tupaki Desk | 22 Sept 2015 11:00 PM ISTనెల్లూరు యాస మాట్లాడుతూ తెరపై నవ్వులు పండిస్తుంటాడు సప్తగిరి. ఈమధ్య బ్రహ్మానందం స్థాయిలో ఆయన్ని భలే వాడేస్తున్నారు దర్శకులు. అందుకే ఓ సినిమాలో నేనేమైనా బ్రహ్మానందమా..? అంటూ డైలాగ్ కూడా చెబుతాడు సప్తగిరి. ఆయన ఇప్పుడు కలర్స్ పిల్ల స్వాతికి మేనమామయ్యాడు. అదెలా అంటారా? కలర్స్ స్వాతి ప్రధానపాత్రలో `త్రిపుర` అనే సినిమా చేసింది. అందులోనే సప్తగిరి స్వాతికి మావయ్యగా నటించాడట. ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఫుల్ హిలేరియస్ గా సాగుతాయట. స్వాతిని పెళ్లి చేసుకోవాలని సప్తగిరి తంటాలు పడుతూ వచ్చే సంబంధాలన్నీ చెడగొట్టేస్తుంటాడట. ఆ సన్నివేశాలన్నీ హిలేరియస్ గా ఉంటాయని ఫిల్మ్ నగర్ టాక్. సినిమాలో 80శాతం సన్నివేశాల్లో సప్తగిరి కనిపిస్తాడట. సినిమాకి ఆయనే హైలెట్ అవుతాడని తెలుస్తోంది.
`గీతాంజలి` ఫేమ్ రాజ్‌కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా ఓవర్సీస్ బిజినెస్ కూడా పూర్తయినట్టు సమాచారం. టాలీవుడ్ లో క్రేజీ బజ్‌ని కలిగివున్న సినిమాల్లో త్రిపుర ఒకటి. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. స్వాతి కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది. `స్వామి రారా` టైపులో తనకి పేరు తెచ్చిపెడుతుందని నమ్మకంగా చెబుతోంది. సహజంగానే స్వాతి తనని ఎట్రాక్ట్ చేసిన కథల్నే ఒప్పుకొంటుంటుంది. అందుకే మార్కెట్ వర్గాలు కూడా సినిమాపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇటీవల కాలంలో థ్రిల్లర్ సినిమాలకి మంచి డిమాండ్ ఉండటం సినిమా బృందానికి కలిసొచ్చే అంశం.